కందుకూరు : దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా చంద్రబాబుకు ఉందని, భవిష్యత్తు లో చంద్రబాబు నాయుడు తనకు పోటీ వస్తారనే ఉద్దేశంతో ప్రధాని మోడీ బయపడుతున్నారని, అందుకే లోక్ సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారని టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, రాష్ట్ర నాయకత్వ శిక్షణా శిభిరం డైరెక్టర్ దాసరి రాజా మాష్టారు అన్నారు. స్థానిక తెలుగువిజయం ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ శిభిరంలో 160 వ బాచ్ ముగింపు కార్యక్రమంలో హాజరైన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.
ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు చేస్తున్న కృషి కి కేంద్రం కనీస మద్దతు ఇవ్వకపోవడం అత్యంత దుర్మరమైన విషయమన్నారు. చంద్రబాబు మీద రాజకీయ కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో దేశ ప్రధానులను నిర్దేశించిన చంద్రబాబు చూసి మోడీ బయపడుతున్నారని రాజా మాష్టారు అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా అటు జగన్, ఇటు పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ది కోసం వ్యవహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే వారికీ తగిన బుద్ది చెప్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం అన్ని విషయాలలో వివక్ష చూపిస్తోందని అన్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉండదన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ అందించారు. శిక్షణకు గుంటూరు జిల్లా వేమూరు, నెల్లూరు జిల్లా గూడూరు నియోజక వర్గ గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్, కో ఆర్డినేటర్ కాకర్ల మల్లిఖార్జున్, శిక్షకులు పసుపులేటి పాపారావు, చైతన్య, పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.