Home ఆంధ్రప్రదేశ్ విశాఖ జోన్ పై మోడీ కుతంత్రం

విశాఖ జోన్ పై మోడీ కుతంత్రం

394
0

విశాఖపట్నం : చట్టంలో లేనందున హోదా ఇవ్వలేమని చెబుతున్న ప్రధాని మోడీ చట్టంలో ఉన్న విశాఖ రైల్వే జోన్ మాత్రం ఎందుకివ్వట్లేదో చెప్పారు. ఎందుకంటే చెప్పుకోవడానికి అక్కడ కారణం లేదు. అందుకే బీజేపీ ఆంధ్ర నేతలు ముఖ్యంగా స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు విశాఖ జోన్ వచేస్తుంది అని బల్ల గుద్ది మరీ చెబుతుంటారు. అయితే అలా గట్టిగా చెప్పడం వెనుక అసలు కారణం ఇప్పుడు బహిర్గతం అయింది. మోడీకి ఏపీకి సాయం చెవడం ఇష్టం లేదన్నది జగద్విదితం. చట్టంలో ఉన్నది ఎందుకు చేయట్లేదు అని అన్ని వర్గాలు నిలదీస్తుండటంతో బీజేపీ నేతలు జోన్ వస్తుందని చెబుతూ వచ్చారు. అయితే ఈ జోన్ ఇవ్వడం వెనుక కూడా కుట్ర ఉందని తాజాగా వెల్లడి అయింది. విశాఖ నుంచి ఆదాయం వచ్చే మార్గాలను విభజించి వాటిని భౌగోళిక ప్రాంతంతో సంబంధం లేకుండా విశాఖ నుంచి వేరు చేసి ఒడిశాలో కలిపేసి మిగిలిన ప్రాంతంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అనేది ఆ కుట్ర. అందుకే ఏ హామీని నెరవేర్చని బీజేపీ నేతలు జోన్ విషయంలో మాత్రం నమ్మకంగా మాటలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కుట్రకు ఇప్పుడు తెర లేచింది.

పేరుకు జోన్ ఇచ్చామని చెప్పాలి కానీ దానివల్ల ప్రయోజనం ఉండకూడదు అనే ఈ కుట్రకు ఈ నెల 14, 15 తేదీల్లో తెర లేవబోతుంది. ఎందుకంటే ఆ రోజు పార్లమెంటరీ కమిటీ విశాఖ పర్యటనకు రాబోతుంది. వాల్తేరు డివిజన్‌లోని 70 శాతం ఒడిశా, ఛత్తీస్ గఢ్‌లకు విడిచిపెట్టి, మిగిలిన 30శాతం కొత్త జోన్‌లో కలపాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రాలో కొత్తజోన్‌ ఏర్పాటుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతూనే ఒడిశాకు కూడా పూర్తి న్యాయం చేయాలని ఆ రాష్ట్ర సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. తాజా కదలికపై రైల్వేవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. డివిజన్‌ పరిధిలోని 30శాతం ఏ ప్రాతిపదికన విడదీస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.

ఉత్తరాంధ్ర పరిధిని విడదీసి కొత్తజోన్‌లో విలీనం చేస్తారా లేక ఆదాయపరంగా కలిగే ప్రయోజనాలను సరళీకరించి లైన్ల(మార్గాల) వారీగా విభజన చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. డివిజన్‌లో ఎక్కువశాతం రూటు, ట్రాక్‌ ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. అందుకే డివిజన్‌లోని మార్గాల విభజనపై కసరత్తు చేయక తప్పదు. ఆదాయాన్ని సమకూర్చే కేఆర్‌ లైను, కేకే లైను, ఆర్‌వీ లైను వల్ల ఏడాదికి సుమారు రూ.7వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా.. దానిలో పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. అందువల్ల ప్రధాన మార్గాల్లో కొంత కొత్తజోన్‌లో విలీనమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే విశాఖ నుంచి ఇచ్ఛాపురం, అరకు వరకు కొత్త జోన్‌లో విలీనం చేస్తే రైల్వేపరంగా ఉత్తరాంధ్ర ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంటున్నారు.

అయితే ఆదాయం తెచ్చే సరుకు రవాణా మార్గాలు తగ్గినా కొత్త జోన్‌ వల్ల కేవలం ప్రయాణికుల అవసరాలను తీర్చుకునే సౌలభ్యం మాత్రం లభిస్తుంది. ర్యాక్‌ల కొరత తీరుతుంది. ఉద్యోగావకాశాలు కొంత పెరుగుతాయి. పర్యాటక, పారిశ్రామిక, విద్యారంగాల్లో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయం ఉంది. కొత్త జోన్‌ ఏర్పాటులో విలీనం, విభజన, ఇతర అంశాలను పక్కనపెడితే విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేయడమే ముఖ్యమని రైల్వే నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్రకటన చేసినా కార్యరూపం దాల్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. గతంలో తూర్పుకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటును 1996లో ప్రకటిస్తే 2003లో కార్యరూపం దాల్చింది. దరిమిలా విశాఖ కేంద్రంగా గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లుగా కొత్త జోన్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు వెంటనే ప్రకటన చేయాల్సిన ఆవశ్యకత ఉంది.