చీరాల : స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యంగా పనిచేయాలని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోఎ నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై దృష్టి, స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉద్దేశం, పేదరికం లేని సమాజం, ఆర్ధిక అసమానతలు తగ్గించడమే లక్ష్యంగా విజన్-2047 అంశాలపై నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ విజన్ ప్లాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఒ చంద్రశేఖర్‌నాయుడు, మున్సిపల్ కమిషనర్, చీరాల, వేటపాలెం తహశీల్దార్లు గోపికృష్ణ, అదికారులు పాల్గొన్నారు.