శింగరాయకొండ : రామయపట్నంలో నిర్మించనున్న పోర్టు ప్రకాశం జిల్లా ప్రజలకు వరం కానుందని జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు మంజూరుపట్ల ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రులు మాట్లాడారు. జిల్లా ప్రజల చిరకాల కోరిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో నెరవేరబోతుందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్దికి టిడిపి కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వైసిపి చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. జిల్లాలో ఉన్నత స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సభలో అటవీ అభివృద్ది కమిటి ఛైర్మన్ డాక్టర్ దివి శివరాం, ఎంఎల్సి కరణం బలరామకృష్ణమూర్తి, ఎంఎల్సి మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనిగిరి ఎంఎల్ఎ కదిరి బాబురావు, టిడిపి జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్, దామచర్ల సత్య, కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, పర్చూరు ఎంఎల్ఎ ఏలూరి సాంబశివరావు, మాజీ ఎంఎల్ఎ బిఎన్ విజయకుమార్, కందుకూరు ఎంఎల్ఎ పోతుల రామారావు, జెడ్పి మాజీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, లంకా దినకర్ పాల్గొన్నారు.