చీరాల : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు.
ఈ నెల 18, 19తేదీల్లో చీరాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ రానున్నారు. 18న చీరాల వచ్చిన మంత్రి ఐటిసి అతిధి గృహంలో బస చేస్తారు. మంత్రి పర్యటన ఏర్పాట్లపై చీరాల తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడారు.
19న తొలుత రూ.2కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తారని తెలిపారు. చేనేతపురిలో చేనేత కార్మికులు, రామాపురం మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం కొత్తపేటలో నూతన జెడ్పి ఉన్నత పాఠశాల ప్రారంభం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాల్లో పాల్గొంటారని జేసీ తెలిపారు. సమావేశం అనంతరం కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న జెడ్పి ఉన్నత పాఠశాల పనులను పరిశీలించారు. సమావేశంలో ఎమ్యెల్యే తోపాటు రెండో సంయుక్త కలెక్టర్ మార్కండేయులు, డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, పీపీ ఎంఎస్ మురళి, మత్స్య శాఖ జెడి బలరాము, పశు సంవర్ధక శాఖ అధికారి రవీంద్రనాద్ ఠాగూర్, డిఎస్పీ డాక్టర్ ప్రేమకాజల్, ఎస్ఎస్ఏ పిఓ నాగేశ్వరవు, డిఇఓ సుబ్బారావు, ఆర్ అండ్ బి ఎస్ఇ దేవదాసు, హాండలూమ్ ఎడి శివన్నారాయణ, డిపిఓ ఎంఎస్ఎస్ఎంవి ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి శ్రీరామమూర్తి, ఐసిడిఎస్ పిడి సరోజిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.