Home బాపట్ల కామాక్షి హాస్పిటల్ లో విజయవంతంగా చెవి, ముక్కు, గొంతు వైద్యశిబిరం 

కామాక్షి హాస్పిటల్ లో విజయవంతంగా చెవి, ముక్కు, గొంతు వైద్యశిబిరం 

31
0

చీరాల : స్థానిక కామాక్షి కేర్ హాస్పిటల్ లో చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడే వారికి ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఎన్ టి వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ వేము మాట్లాడారు. మొదటి దశలో చెవి, ముక్కు, గొంతు సమస్యల్ని గుర్తించి సరైన వైద్యాన్ని పొందాలని సూచించారు. తెల్ల కార్డు ఉన్నవారికి చీరాలలో అన్ని రకాల చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. అనంతరం వైద్య శిబిరంలో 65 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేశారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, ఎముకల ఆపరేషన్లు, కడుపుకు సంబంధించిన ఆపరేషన్లు, కిడ్నీలో రాళ్లు వున్నవారికి, మూత్ర సంబంధిత ఆపరేషన్లు, డయాలసిస్ సేవలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందించనున్నట్లు హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ దివ్య, షుగర్ స్పెషలిస్ట్ కుమార్, డాక్టర్ తాడివలస కుమార్, జిఎం తాడివలస సురేష్, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.