Home బాపట్ల మద్యాహ్న భోజనం పరిశీలన

మద్యాహ్న భోజనం పరిశీలన

18
0

చీరాల (DN5 News) : స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పధకం అమలు తీరును శాసన సభ్యులు ఎంఎం కొండయ్య మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత చూశారు. విద్యార్ధినీ, విద్యార్థులతో విడి విడిగా మాట్లాడారు. వంట గదులు, భోజన హాలు పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి భోజనం చేసి స్వయంగా నాణ్యత తెలుసుకున్నారు. భోజనం మెనూ, రుచి, నాణ్యతగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సాల్మన్ రాజు, ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట మున్సిపల్‌ ఛైర్మన్‌ మించాల సాంబశివరావు, ఎఎంసి ఛైర్మన్‌ కౌతరపు జనార్ధనరావు, ఇతర నాయకులు ఉన్నారు.