Home ఆధ్యాత్మికం శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు

శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు

386
0

చీరాల : కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలు భక్తుల శివ నామస్మరణతో మారోగాయి. వేకువజామున పుణ్యస్నా నమాచరించిన భక్తులు పేరాల శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు ఆలయంలో దీపారాధన చేశారు. సముద్ర తీరంలోని మహిళలు కార్తీక పుణ్య స్నానాలు ఆచరించు గంగమ్మకు హారతి పట్టారు. పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అనంతరం కోదండరామస్వామిని దర్శించుకున్నారు.

బాపట్ల : సూర్యలంక సముద్ర తీరం వద్ద భక్తులు వేకువజామున సముద్ర స్నానాలు చెందారు. పసుపు, కుంకుమతో దీపారాధన చేసి హారతి పట్టారు.