చినగంజాం : భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన వ్యాపార అభివృద్ధికి కారణమైన గ్రామాన్ని బీమా గ్రామంగా గుర్తించి ఆ గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి సంవత్సరం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆర్ధిక సహాయం చేస్తుంది.
2016-2017వ ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ బీమా పాలసీలు ఇచ్చిన గ్రామంగా గుర్తించారు. గ్రామాభివృద్ధికి రూ.50వేల చెక్కును చీరాల ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఎస్ శ్రీనివాసరావు పంచాయతీ ఇంచార్జి అధికారి కె వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి పురోగతి, ఆవశ్యకతను అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పి తిరుమలరావు, ఉద్యోగుల యూనియన్ నాయకులు బి నాగేశ్వరరావు, టి విజయ్ కుమార్, ఆర్వీఎస్ రామిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఏజెంట్స్ యూనియన్ నాయకులు వి వేణు బాబు, ఆర్ వీరయ్య, వివి సుబ్బారావు పాల్గొన్నారు.