చీరాల : గ్రంధాలయ సంస్థ నిధుల కొరత, సిబ్బంది కొరత కారణంగా చీరాల పట్టణంలో ఇక నుండి వారంలో నాలుగు రోజుల మాత్రమే గ్రంధాలయం తెరుచుకుంటుందని గ్రంధపాలకులు ఎఎన్ రామారావు, పి చెన్పరెడ్డి తెలిపారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఉత్తర్వుల మేరకు కారంచేడు, వేటపాలెం గ్రంధాలయాలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. ఆగష్టు 19నుండి చీరాల గ్రంధాలయం వేటపాలెం గ్రంధాలయ పాలకునికి ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇస్తున్నందున రోజుకు వెయ్యి పుస్తకాల చొప్పున చీరాల గ్రంధాలయంలోని 36వేల పుస్తకాలను అప్పగించేందుకు 40రోజులు సమయం పడుతుందని పేర్కొన్నారు. ఆతర్వాత శని, ఆది, సోమ, బుధవారాల్లో మాత్రమే గ్రంధాలయం పనిచేస్తుందని తెలిపారు.