చెన్నై: లోకనాయకుడు కమల్‌హాసన్ బుధవారం మధురైలో రాజకీయ పార్టీని ప్రారంభించన్నారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ ఇస్తున్న విందుకు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. కమల్ హాసన్ సన్నిహితులు ఈ విషయాన్ని మంగళవారం వెళ్లడించారు. కేజ్రీవాల్ మధురైలో సాయంత్రం జరిగే బహిరంగ సభకు కూడా హాజరవుతారని తెలిపారు. గతంలో కేజ్రీవాల్ కమల్‌హాసన్‌ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. గత ఏడాది సెప్టెంబరులో కేజ్రీవాల్ కమల్‌హాసన్‌ను కలిసి మాట్లాడారు.
అప్పట్లో కమల్ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు రావడంతో కేజ్రీవాల్ ఈ విషయంపై కమల్‌తో చర్చించారు. దేశంలో అవినీతి, మతతత్వం బాగా పెరిగిపోయిందని, ఒకే విధంగా ఆలోచించే నాయకులు చర్చించుకొని వాటిని అరికట్టేందుకు కలిసి పనిచేయాలని అప్పట్లో కేజ్రీవాల్ సూచించారు. ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఆహ్వానించడం గమనార్హం. తనకు అధికార అన్నాడీఎంకే నేతలతో మాట్లాడే ఉద్దేశం లేదని కమల్ స్పష్టంగా చెప్పారు.