చీరాల : జియో నెట్వర్క్ చీరాలలో శనివారం ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు పని చేయలేదు. ఇంటర్ నెట్ కోసం జియో ఫోన్స్ తీసుకున్న వినియోగదారులు ప్రతిరోజు అవస్థలు పడుతున్నారు. ఫోన్ కలవక పోవడం, రెండు నెటీవర్కుల సిమ్ లు ఒకే ఫోన్లో ఉన్న వినియోగదారుల బాధలు చెప్పడానికి వీరి మాటల్లోనే వినాలి. నెట్ వర్క్ కలిగినా ఎప్పుడు పోతుందో తెలియదు. ఇతర నెట్ వర్క్ ఫోన్లు బాగున్నప్పటికి జియో నెట్ వర్క్ వినియోగదారులకు మాత్రం ఫోన్ పలికితే వరంగా భావించే పరిస్థితి నెలకొంది.