చీరాల : భారీవర్షాలు, వరదల్లో కకావికళమైన కేరళను ఆదుకునేందుకు సిఐటియు అనుంబంధ ఐఎల్టిడి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కంపెనీ కార్మికులనుండి సోమవారం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరదలో కూరుకుపోయిన కేరళ ప్రజలను ఆదుకోవాలని కార్మికులను కోరారు. ఐఎల్టిడి ఫెడరేషన్ కార్యదర్శి గొసాల సుధాకర్ మాట్లాడుతూ వరద బాధితులకు ఐఎల్టిడిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు తమవంతు ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. కార్మికులతోపాటు ప్రజలనుండి కూడా విరాళాలు సేకరించి కేరళ ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా కార్మికులనుండి రూ.10186లను సేకరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చిప్పలపల్లి శివరాజు, సిఐటియు కార్యదర్శి ఎన్ బాబురావు, ఐఎల్టిడి నాయకులు ఎం రవిచంద్ర, పి కాలేషా, బుజ్జి పాల్గొన్నారు.