Home జాతీయం క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ యాత్ర ఆరంభం

క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ యాత్ర ఆరంభం

432
0

చెన్నై: ప‌్ర‌ముఖ సినీన‌టులు, లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర మొదలైంది. బుధ‌వారం ఉదయం ఆయన రామేశ్వరానికి చేరుకున్నారు. మత్య్సకారులతో సమావేశమయ్యారు. అనంతరం స్థానిక హయత్ పేల‌స్‌ హోటల్‌లో విలేకర్ల సమావేశం నిర్వ‌హించారు. కమల్‌ రాగానే అభిమానులంతా ‘సీఎం వచ్చారు’ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ..‘నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్‌ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు. రాజకీయ యాత్రలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు నన్ను కలవడానికి వచ్చి శాలువాలు కప్పుతున్నారు. ఇంకెప్పుడూ ఇలా నాకు శాలువాలు కప్పవద్దు. నేను మీ శాలువాగా మారి మీకు రక్షణ కల్పిస్తాను.’ అన్నారు.

‘రామేశ్వరంలో డాక్ట‌ర్ అబ్దుల్‌ కలాం చదివిన పాఠశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ పాఠశాల యాజమాన్యం నాకు అనుమతి ఇవ్వలేదు. పాఠశాలకు రానివ్వకుండా అడ్డుకోగలిగారు కానీ నేను నేర్చకోవాలనుకున్న విషయాలను మాత్రం అడ్డుకోలేరు. తమిళనాడు ప్రజల గుండెల్లో నేనున్నాను. ఇప్పుడు వారి ఇళ్లల్లోనూ ఉండాలనుకుంటున్నాను. సినిమాలకు, రాజకీయాలకు పెద్ద తేడా లేదు. రెండు రంగాలు ప్రజల కోసమే. కానీ సినిమాల కంటే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలదే. అబ్దుల్‌ కలాం చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలా మంది అడుగుతున్నారు. సాధారణంగా నేను అంత్యక్రియలకు హాజరుకాను.’ అని క‌మ‌ల్‌హాస‌న్‌ చెప్పుకొచ్చారు.