Home ప్రకాశం బీమా వారోత్సవాలు ప్రారంభం…

బీమా వారోత్సవాలు ప్రారంభం…

460
0

చీరాల : భారతీయ జీవిత బీమా సంస్థ జాతీయకరణ జరిగి 62 వసంతాలు పూర్తి అయి 63వ వసంతంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా చీరాల కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎల్ఐసి సాధించిన ప్రగతిని బ్రాంచ్ మేనేజర్ ఎస్ శ్రీనివాసరావు వివరించారు. ఈ వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యాక్షిస్ బాంక్ మేనేజర్ సాయికృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టీవీ రావు, వి కృపారావు, బి నాగేశ్వరరావు, టి విజయ కుమార్, ఆర్వీఎస్ రామి రెడ్డి, పి తిరుమలరావు, బ్రాంచి సిబ్బంది పాల్గొన్నారు.