
Illu Illalu Pillalu Today జూన్ 09 ఎపిసోడ్ : నర్మద, సాగర్‌లకు పెళ్లై ఆర్నెళ్లుపైనే అయ్యింది. కొత్తగా పెళ్లైన వాళ్లకి తొలిరాత్రి తంతు జరిపించాలనే బుద్ది, జ్ఞానం ఇప్పటివరకూ కలగలేదు రామరాజుకి. ఇక వీళ్లు శోభనం చేయించేసరికి పుష్కరం గడిచిపోయేట్టు ఉందని.. వాళ్లే తొందరపడ్డారు. ఆ తంతు దిగ్విజయంగా ముగించుకున్నాక.. ఇప్పుడు రామరాజుకి వాళ్లకి శోభనం జరిపించాలనే ఆలోచన కలిగింది. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. Photo Courtesy Jio Hotstar And Star Maa
ఇంటి పెద్ద కోడలికి శోభనం కాకుండా తాను శోభనం చేసుకుని పిల్లల్ని కనడం మంచిది కాదనుకున్న నర్మద.. తన శోభనాన్ని పెద బావ పెళ్లి అయ్యేవరకూ వాయిదా వేసుకుంటుంది. తీరా పెళ్లయ్యాక.. కొత్త కోడలు శ్రీవల్లితో పాటు.. నర్మదకి కూడా ఒకేసారి శోభనం జరిపించడానికి ముహూర్తం పెడతారు. అయితే శ్రీవల్లి.. పెద్ద కోడలైన తనకే ముందు పిల్లలు పుట్టాలనే దురుద్దేశంతో నర్మద శోభనం జరక్కుండా చేసేస్తుంది. అయితే నర్మద ఊరుకుంటుందా? వీళ్లు శోభనం జరిపించేసరికి పుష్కరం గడిచిపోతుందని తన భర్త సాగర్‌ని హైదరాబాద్ తీసుకుని వెళ్లిమరీ.. అక్కడే ఆ కార్యం ముగించింది. ఆ విషయం అత్తకి చెప్పింది కానీ.. రామరాజుకి తెలియదు. అదే గోడచెవుల శ్రీవల్లికి ఈ విషయం తెలిసిపోవడాన్ని శనివారం నాటి ఎపిసోడ్‌లో చూశాం. ఇక ఈరోజు (జూన్ 09) రాత్రి ప్రసారం కాబోయే 180వ ఎపిసోడ్‌లో ఏమైందంటే.. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా.. పెళ్లై ఆర్నెళ్లు అయిన తరువాత.. అది కూడా వీళ్లు ఇక శోభనం జరిపించరులే అని నర్మదే శోభనం చేసుకున్నాక.. మామ రామరాజుకి వాళ్ల శోభనం గురించి సడెన్‌గా గుర్తొచ్చింది. పంతులు గారి దగ్గరకు వెళ్లాను. ఫస్ట్ నైట్‌కి ముహూర్తం పెట్టించాను అని అంటాడు రామరాజు.
ఆ మాట విని షాక్ అయిన వేదవతి.. ‘అయ్యో.. వాళ్లకి ఆల్రెడీ అయిపోయిందని ఎలా చెప్పాలే’ అని అనుకుంటుంది. ఇంతలో శ్రీవల్లి.. పెద్దగా నవ్వుతుంది. రామరాజు వచ్చి.. ‘ఎందుకు అంతలా నవ్వుతున్నావ్’ అని అడుగుతాడు. దాంతో శ్రీవల్లి.. ‘అయ్య బాబోయ.. అయ్య బాబోయ్.. ఈ నవ్వు ఆపుకోవడం నా వల్ల కావడం లేదండీ మామయ్య గారండీ.. పొట్ట పగిలిపోయేలా ఉంది’ అని అంటుంది. ‘ఎందుకు?? ఏమైంది?? ఎందుకు అంతలా నవ్వుతున్నావ్’ అని రామరాజు గట్టిగా అడిగేసరికి.. ‘అంటే అండీ మామయ్య గారండీ.. నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దండీ.. మీరు దేవుడు లాంటోరే కాదు.. ఒట్టి అమాయకులు కూడా.
మీరేమో ఇంటి పెద్దగా.. కొడుకు కోడలికి శోభనం జరిపించడం మీ బాధ్యతని అనుకుంటున్నారు. కానీ.. వాళ్ల శోభనం హైదరాబాద్‌లోనే జరిగిపోయిందండీ. అని వాగేస్తుంది శ్రీవల్లి. దెబ్బకి షాక్ అయిపోతాడు రామరాజు. నర్మద అయితే సిగ్గుతో తలదించేసుకుంటుంది. ‘ఏంటి అక్కా.. నాకు విషయం చెప్పనేలేదు’ అని అంటుంది ప్రేమ. ఇది అందరి ముందు చెప్పేదా? ఆవిడ గారు చూడు అందరి ముందు ఎలా.. చెప్ప కూడని విషయాలన్నీ చెప్తుందో.. అని అంటుంది ప్రేమ. ‘అవును అక్కా.. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు’ అని అంటుంది ప్రేమ. ఇక సాగర్.. హిట్లర్ బాబు రామరాజు ఏమంటాడో అని భయపడుతుంటాడు.
ఇక శ్రీవల్లి ఇంకా ఎక్కిస్తుంటుంది. ‘అంటే మామయ్య గారండీ.. మీరు ఈ ఇంట్లో అందరి మంచి చెడు గురించి ఆలోచిస్తారండీ.. కానీ మీ గురించి ఆలోచించి.. మీ పర్మిషన్ తీసుకునే ధోరణిలో నర్మద, సాగర్‌లు ఎక్కడున్నారు లెండి’ అని అంటుంది. దాంతో వేదవతి.. ‘ఏయ్ వల్లీ.. నువ్వు నోరు మూస్తావా? అని వారిస్తుంది. అనంతరం రామరాజుతో.. ‘ఏవండీ అంటే వాళ్లు అక్కడికి వెళ్లారు కదండీ అది ఒక మంచి సందర్భం అనుకుని ఏదో అలా? అని కవర్ చేయబోతుంది. దాంతో రామరాజు.. ఇక చాలు బుజ్జమ్మా.. నాకేం చెప్పకు అని కోపంగా లోపలికి వెళ్లిపోతాడు.
హమ్మయ్యా బతికించాడు.. ‘ఏరా.. నాకు చెప్పకుండా శోభనం చేసుకున్నారా? అది చేశారా.. ఇది చేశారా’ అంటూ సిగ్గులేకుండా నిలదీస్తాడేమో అని భయపెట్టాడు కానీ.. ఏమీ మాట్లాడకుండా ఉండి. తన గౌరవాన్ని కాపాడుకున్నాడు రామరాజు. ఇక పెట్టాల్సిన పెంట పెట్టేయడంతో… శ్రీవల్లి నవ్వుతూ రాక్షస ఆనందం పొందుతుంటుంది. పక్కకి వచ్చి డాన్స్‌లు చేస్తూ ఆనందపడుతుంటుంది శ్రీవల్లి. అది చూసిన.. నర్మద.. శ్రీవల్లి దగ్గరకు వచ్చి.. ‘ఛీ ఛీ.. ఏది ఎక్కడ చెప్పాలో కూడా తెలియదు? చెప్తా దీని పని అంటూ ప్రేమను తీసుకుని శ్రీవల్లి దగ్గరకు వస్తుంది.
ఏయ్ నీకు అసలు బుద్ధి ఉందా? తినేది అన్నమేనా అని చేయి ప్రేమ వైపు చూపిస్తూ.. తిట్లు మాత్రం శ్రీవల్లినే తిడుతుంటుంది నర్మద. ‘లేవుగా.. నాకు అలాంటివేం లేవుగా.. నాకు సిగ్గేలేదు’ అని అంటుంది ప్రేమ ఇన్ డైరెక్ట్‌గా శ్రీవల్లిని చూపిస్తూ. అటు ప్రేమ.. ఇటు నర్మద.. మధ్యలో శ్రీవల్లిని పెట్టి ఇన్ డైరెక్ట్‌గా తిట్టిపారేస్తుంటారు. ఇద్దరూ కలిసి చెడుగుడు ఆడుకుంటారు. ‘బాగానే చదువుకున్నానని అన్నావ్ కదా.. ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలోఅన్న బుద్ధి, జ్ఞానం లేవా? నీకు అని అంటుంది నర్మద. ‘నో.. కదా అస్సలు లేవు కదా.. ఎందుకంటే నా చదువుపైనే నాకు డౌట్ కదా? అని అంటుంది ప్రేమ.
ఆ మాటలకి రగిలిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ‘మీరు వంక పెట్టి నన్నే తిడుతున్నారు కదా’ అని అంటుంది. దాంతో నర్మద, ప్రేమలు.. ‘అయ్యయ్యో.. ఎంత మాట ఎంత మాటా.. అసలు నువ్వు ఎవరివీ ఈ ఇంటికి పేద్ద కోడలివి.. ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ.. నీమీదే ఉన్నాయ్ కదా.. ఇంత గొప్పదానివైన నిన్ను మేం అంటామా? పైగా నువ్వు ఎంఏ ఇంగ్లీష్.. అలాంటి నిన్ను అంటామా? నన్ను కాదులే అక్కాయ్.. ఈ మధ్య ప్రేమ నోటికొచ్చినట్టు వాగుతుంది. అందుకే బుద్ధి చెప్పి గడ్డిపెడుతున్నాను. తాడి చెట్టులా పెరిగావ్.. కాస్త నోరు అదుపులో పెట్టుకో’ అని ప్రేమని వంకపెట్టి… శ్రీవల్లిని వాయించిపారేస్తుంది నర్మద.
దాంతో ప్రేమ.. ‘నేను ఇంతే ఇలాగే మాట్లాడతాను.. ఇలాగే ఉంటాను’ అని అంటుంది. ‘ఏ.. మీ అమ్మా బాబూ సంస్కారం నేర్పించలేదా? అని అంటుంది నర్మద. ‘అబ్బే.. మాకు అలాంటివేం తెలియదు… ఆ బుద్దీ సంస్కారం వాళ్లకే లేవు.. ఇక నాకేం నేర్పిస్తారులే’ అని అంటుంది ప్రేమ. ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదుగా అని నర్మద అంటే.. ‘సిగ్గా.. అదెలా ఉంటుందో కూడా నాకు తెలియదే.. పైగా నాకు కాస్త స్క్రూ లూస్.. బుర్ర కూడా కుదురుగా ఉండదు. అందుకే ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది వాగుతాను’ అని అంటుంది ప్రేమ.
దాంతో శ్రీవల్లి.. ‘ఎహే ఆపండీ.. నాకు అర్థమైంది.. మీరు నన్నే అంటున్నారని నాకు బాగా అర్థమైంది. నాకు టైమ్ వచ్చినప్పుడు చెప్తాను’ అని అంటుంది. పీకావ్ లే అన్నట్టుగా చేతులు దులుపుకుంటారు ప్రేమ, నర్మదలు. ఇంకోసారి మన విషయంలో జోక్యం చేసుకోదు అని చేతులు కలిపేస్తారు ప్రేమ, నర్మదలు. ఇక వేదవతి దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. ఇక ప్రేమ, నర్మదలు వెళ్లి.. ‘ఏంటి మైడియర్ అత్తయ్య గారూ.. ఆ వల్లి చేసిన లొల్లి చూశారుగా’ అని అంటారు. అదేంటే.. అలా ఉందీ.. ఆ విషయాన్ని అందరి ముందూ చెప్తారా? అని అంటుంది వేదవతి. ‘ఏరుకోరి తెచ్చి నెత్తినపెట్టున్నారు కదా.. అనుభవించండి’ అని మూతి తిప్పి వెళ్లిపోతారు నర్మద, ప్రేమలు. దాంతో వేదవతి.. ‘ఈ కోడళ్ల దెబ్బకి నా తల బద్దలైపోతుందే’ అని తలబాదుకుంటుంది వేదవతి.