Illu illalu pillalu today (jun 16th) episode no.186 : నిన్నటి ఎపిసోడ్ లో ఇంటిలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేయమని వల్లి తల్లి భాగ్యం సలహా ఇస్తుంది. దీంతో వల్లి రెచ్చిపోతుంది. ప్రేమ డాన్స్ క్లాస్ విష్ణు మామకు చెప్పేస్తుంది. తనకు తెలియకుండా పనిచేస్తూ… తన పరువు తీస్తున్నారని పెదపిచ్చయ్య రగిలిపోతుంటాడు…. ఇక ఈ రోజు ఏమి జరిగింది అంటే….
డాన్స్ క్లాస్ నుంచి నర్మదా, ప్రేమ ఇంటికి వస్తారు. ఇంట్లో పెద్ద పిచ్చయ్య సీరియస్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రేమ డాన్స్ క్లాస్ గురుంచి చెప్పబోతుంది. చెయ్యి అడ్డంగా చూపుతూ… మీ ఇద్దరు ఒకరికొకరు సపోర్టు చేసుకోవడం అద్భుతం, అమోఘం. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి తెలివితేటలు ఉండటం సహజమే అనుకున్నాను. కానీ మీ ఇద్దరిలో ఇంత అద్భుతమైన, ఎదుటివారిని పిచ్చోళ్లను చేసే తెలివితేటలు ఉన్నాయని తెలియ లేదమ్మా. అంటూ మండి పడతాడు. వల్లి మనసులో ఆనందపడుతూ అప్పుడే అక్కడికి చేరుకుంటుంది. ఏమండీ ఎందుకు అలా అంటున్నారని బుజ్జమ్మ అడుగుతుంది. చిన్న కోడళ్లు ఇద్దరి దృష్టిలో తనంటే లెక్క లేదని మాట్లాడుతాడు. సమాధానం చెప్పమని బుజ్జమ్మ అడుగుతే. వెంటనే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటాడు. ఎవరి గురించి అని బుజ్జమ్మ అడుగుతుంది. చిన్న కోడలు డాన్స్ క్లాస్ చెబుతుంది. ఆమెకు ఈమె ఉద్యోగం చూసింది అంటూ నర్మద వైపు చూపుతాడు. ఇద్దరూ కలిసి నన్నే కాదు నిన్ను కూడా పిచ్చిదాన్ని చేశారన్నమాట. ఏం జరిగిందో అర్థం కావట్లేదు అంటూ బుజ్జమ్మంటుంది.
ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్లి వస్తుందో తెలుసా. బయట ఎక్కడో డాన్స్ క్లాస్ చెప్పి వస్తుంది అంటాడు . ఉద్యోగం చూసింది నర్మదా అంటాడు. ట్యూషన్ చెప్పడానికి వీల్లేదని చెప్పినా కూడా వినకుండా మీ వాళ్లు అవమానిస్తున్నారని చెప్పినా కూడా వినకుండా డాన్స్ క్లాస్ చెప్పుకుంటున్నాం అంటే నీ ఉద్దేశం ఏమిటి అంటాడు. అర్థం కావడం లేదుఅంటుంది. అంటే నన్ను అవమానించడం పనిగా పెట్టుకున్నావా అని ప్రశ్నిస్తాడు. మామయ్య నేను ఈ ఇంటి కోడల్ని. మీ గౌరవాన్ని పెంచుతానే తప్ప తగ్గించే పని ఎందుకు చేస్తామంటుంది. మరి డాన్స్ క్లాస్ కి ఎందుకు వెళ్లావు అని అంటాడు. మా ఆయనకి సపోర్ట్ గా ఉండటం కోసం అని చెబుతుంది. మా ఆయనకి అండగా ఉండాలని పనిచేస్తున్నాను అంటుంది. చిన్నోడికి అండగా ఉండాలని చేస్తుందని బుజ్జమ్మ సర్దిచెప్పే ప్రయత్నం బుజ్జమ్మ చేస్తుంది. మీ వాళ్ళు నన్ను ఇప్పటికీ అంటూనే ఉన్నారు. డాన్స్ క్లాస్ చెప్పి వస్తే ఆమె సంపాదిలతోనే మనం బ్రతుకుతున్నామని వాళ్ళు ఇంకా హేళన చేస్తారు. చదువుకునే అమ్మాయితో పని చేయించడం తప్పు కాబట్టి. భార్య బాధ్యత భర్త తీసుకోవాలి కానీ ఈ అమ్మాయి పనిచేసి డబ్బు తీసుకొస్తే వాళ్ల దృష్టిలో వీడు చేతగాని వాడు అవుతాడు అంటాడు.
నర్మదా జోక్యం చేసుకుని అలా ఎందుకు అనుకుంటారు మామయ్య. అమ్మాయిలు ఇవాళ రేపు ఉద్యోగాలు చేస్తూ ఉండటం సహజం అవుతుంది అంటుంది. దీంతో మండిపడతాడు. నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలా. ఇంట్లో గొడవలు అన్నిటికీ కారణం నువ్వే అని అంటాడు. నీ ఉద్యోగం నువ్వు చేసుకుని గమ్ముగా ఉండొచ్చు కదా. తనకు తెలుసు తెలియకో అడిగితే ఉద్యోగం నువ్వే ఇప్పించావు. నువ్వు రాకముందు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది. నువ్వు వచ్చాక ఇంట్లో గొడవలు పెరిగాయి. ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నువ్వే కారణం అవుతున్నావ్. ఇదిగో ఒక పని చెయ్ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో… అంటాడు. బుచ్చమ్మ జోక్యం చేసుకొని ఏంటండీ అని అంటుంది. బుజ్జమ్మ నోరు మూయిస్తాడు. ప్రేమను లేపికెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ సంపాదనేదో వాడే చేస్తాడు… అంటూ వెళ్ళిపోతాడు. నర్మదా ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. అందరూ బాధలో ఉండగా… లొల్లి పెట్టిన వల్లి ఆనందంతో తన గదిలోకి వెళ్లి చిందులు వేస్తుంది.
మీరిద్దరూ ఒకటై… డ్రామాలాడి… నన్ను వంటరి చేసి హనీమున్ చేద్దాగోడితే చూస్తూ ఉంటానా… ఇప్పుడు ఒక దెబ్బకు రెండు పిట్టలు రాలాయి. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందంటూ సంతోషపడుతుంది. జరిగిన దాన్ని తలుచుకుంటూ నర్మదా కన్నీళ్లు పెడుతుంది. ప్రేమ కూడా తలుచుకుని బాధపడుతుంది.
కోడళ్ల విషయంలో మీరు చేసింది కరెక్టేనా అంటూ బుచ్చమ్మ నిలదీస్తుంది. నాకు తెలియకుండా వాళ్ళు ఉద్యోగం చేయడం తప్పు కాదా అంతాడు. వాళ్ల ఉద్దేశాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు ఎడాపెడా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. తొందరపాటులో నర్మదాను ఎంత మాట అన్నావో తెలుసా. నర్మదా చాలా మంచి పిల్లండి అని చెప్తుంది. వాళ్ల వాళ్ల ను వదిలి వచ్చి మనల్ని బాగా చూసుకుంటుంది. నేను అన్నీ తెలుసుకునే మాట్లాడాను. ఆలోచించే మాట్లాడాను. నాకేమీ సలహాలు సూచనలు ఇవ్వక్కర్లేదు అంటాడు.
ప్రేమ ఏడ్చుకుంటూ ఉందగా ధీరజ్ నవ్విమ్చే ప్రయత్నం చేస్తాడు. నేను బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అంటూ ప్రేమ అంటుంది. మీ నాన్న తిడుతుంటే గమ్ముగా ఉన్నావు. ఎందుకు తిట్టాడు అంటావు. నేను డాన్స్ క్లాస్ చెప్పానని తిట్టాడు అంటుంది. క్లాస్ చెప్పడం కూడా ఆయనకి ఇష్టం లేదని నాకు తెలియదు కదా. మంచి మనసున్న మామయ్య ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. కానీ ఆయన అర్థం చేసుకోవడం లేదు. నా కారణంగా నర్మదా, అత్తయ్య మాటలు పడ్డారు. అని బాధ పడుతుంది. ట్యూషన్ విషయంలో మొదటిసారి గొడవ పడ్డప్పుడు ఎంత కష్టమైనా ఒక్కడినే పడతానని చెప్పాను కదా. మరి ఎవరికీ తెలియకుండా డాన్స్ క్లాస్ చెప్పడానికి ఎందుకు వెళ్లావు. నా వంతుగా నీకు హెల్ప్ అవ్వాలనుకోవడం తప్ప ఎలా అవుతుంది అని ప్రేమ అంటుంది. ఎంత కష్టమైనా సరే నిన్ను నేను చూసుకోగలను. అందుకే నీ కష్టానికి అండగా ఉంటాను ఏదో ఒక జాబ్ చేస్తాను అంటుంది. అత్తను కూల్ చేసేందుకు ఇద్దరు తోడికోడళ్ళు ప్రేమ, నర్మదా అత్తవద్దకు వంటగదిలోకి వెళతారు. వల్లి మాత్రం నర్మదా, ప్రేమకు చివాట్లు పెట్టించిన ఆనందంలో ఉంటుంది. ఏమి జరిగేది రేపటి ఎపిసోడ్ లో చూద్దా…