బాపట్ల : చీరాల, బాపట్ల మండలాల సరిహద్దులోని సముద్ర తీరాన్ని భారీ యంత్రాలతో చదును చేసి రోడ్డు నిర్మాణం చేయడమే కాకుండా సీ మౌత్ ను ధ్వంసం చేసి పూడ్చి వేస్తున్నారు. శ్రీ భ్రమర ఇన్ఫ్రా సంస్థ చేస్తున్న అక్రమ నిర్మాణాలు ఆపేయాలని, భవిష్యత్తులో వరద ప్రమాదం నుండి తమ గ్రామాలను కాపాడాలని స్థానిక విజయలక్ష్మి పురం మత్స్యకారులు కోరుతున్నారు.
రాత్రికి రాత్రి ఈపురుపాలెం స్ట్రైట్ కట్టు సముద్రంలో కలిసే చోట సి మౌత్ కాలువను జెసిబిలు ట్రాక్టర్లతో పెద్దపెద్ద బండరాళ్లు వేసి కూర్చోవేయడానికి నిరసనగా మత్స్యకార గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఇంకేం తెలుసుకున్న బాపట్ల ఆర్డిఓ పి గ్లోరియా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న సముద్రతీరాన్ని పరిశీలించారు.
సంఘటన ప్రదేశానికి చేరుకొని ఆందోళన చేస్తున్న మత్స్యకారులను ఏమైందని అడగకుండా అక్రమ వెంచర్ వేస్తున్న వారి వద్ద కూర్చుని వారికి సపోర్ట్ గా ఉన్నారని ఆర్డిఓ గ్లోరీయాపై మత్యకారులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ వెంకట మురళి ఆదేశాలతో మత్స్యకారులతో ఆర్డీవో గ్లోరియా చర్చించారు.