చీరాల : వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల నియోజకవర్గంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్ర మంగళవారం తో ముగిసింది. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా నియోజకవర్గం స్థాయిలో రెండు రోజుల పాదయాత్రను వైసిపి ఇంచార్జ్ యడం బాలాజీ నిర్వహించారు. చీరాల మండలం కావురివారిపాలెం నుండి ప్రారంభమైన పాదయాత్ర వాడరేవు ఆంజనేయ స్వామి విగ్రహం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇంచార్జ్ నందిగం సురేష్, రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ వి అమృతపాని మాట్లాడారు. వాడరేవు ప్రజలకు వైసిపి అండగా ఉంటుందని అన్నారు. చేనేతలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు.
జగన్ అధికారానికి వస్తే వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పాదయాత్రలో పట్టణ అధ్యక్షుడు బోనిగల జైసన్ బాబు, మండల అధ్యక్షుడు పిన్నిబోయిన రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కోండ్రు బాబ్జి, సాంయేలు మోజెస్, సలగల అమృతరావు, దేవరపల్లి బాబురావు, గోలో ఆనందరావు, గోలో వెంకటరావు, గోలి అంజలీదేవి, ఫిక్కీ కాశిరవు, మచ్చ సువార్తరవు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొరబండి సురేష్, కె శ్యామ్, కోడూరి ప్రసాదరెడ్డి, డేటా దివాకర్, యడం రవిశంకర్, టి మనోహరి, పొదిలి ఐస్వామి పాల్గొన్నారు.