వేటపాలెం : సర్వమానవాళి పాప పరిహారమునకై జీసస్ క్రీస్తు సిలువ మోసి, తన రక్తం చిందించి, సిలువపై మరణమొంది తిరిగి మూడవ రోజు లేచిన యేసుక్రీస్తు బోధించిన మార్గమే సర్వమానవాళ్ళికి మోక్ష మార్గమని ఆర్సిఎం చర్చి విచారణ గురువు టీ కరుణాకర్ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా గుడ్ ఫ్రైడే సూచికంగా ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువను మోస్తూ పొందిన శ్రమలను కళ్ళకు కట్టినట్లుగా పురవిధులలో ప్రదర్శించారు. ప్రపంచంలోని క్రైస్తవ ప్రజలు 40 రోజులు పాటు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్దలతో ఉపవాసలతో ఆచరించే శిలువ మార్గం వేటపాలెంలో ప్రత్యేక ఆకర్షణంగా ఉందని చీరాల మాజీ ఎఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరి అన్నారు.
ఈ కార్యక్రమంలో జెఎంజె సిస్టర్స్ ప్రకాశమ్మ, రాజమ్మ, పెద్దలు మార్పు జార్జి, చేగూడి జాన్సన్, బీమవరపు అలెక్స్, మార్పు రోశయ్య, మార్పు బాలజేసు, మార్పు సుధాకర్, పిల్లి ఉదయ్, సలగల ప్రకాష్, ప్రదీప్, మేడికొండ శేషగిరిరావు, పెర్లి దావీదు, రాజారావు, ఆర్సిఎం యువత శ్యామ్, దిలీప్, సురేష్, చిన్న, నాని, సన్నీ, యెహోను, అబ్రహం, వేటపాలెంలోని జేసునగర్, పొట్టిసుబ్బయ్యపాలెం, అక్కాయపాలెం, సిలోన్ కాలనీ, సెయింట్ ఆంథోనీ లెప్రసీ కాలనీ, రామచంద్రాపురం, సర్వోదయకాలనీ క్రైస్తవ మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు