Home ఆంధ్రప్రదేశ్ సాంకేతిక అభివృద్ధి రాజీవ్ గాంధీ పుణ్యమే : పనబాక

సాంకేతిక అభివృద్ధి రాజీవ్ గాంధీ పుణ్యమే : పనబాక

641
0

చీరాల : దేశాన్ని సాంకేతిక అభివృద్ధివైపు పరుగులు తీయించిన ఘనత దివంగత యువ ప్రధాని రాజీవ్ గాంధీదని మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ అన్నారు.
రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముక్కోణం పార్క్ సెంటర్లోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ మాట్లాడారు. మునిసిపల్ అధికారులు ఒక మాజీ ప్రధాని విగ్రహాన్ని కనీసం జయంతి, వర్ధంతి కి కూడా శుభ్రం చేయకుండా విస్మరించడం దురదృష్టకరమన్నారు. దేశాన్ని సాంకేతిక అభివృద్ధి వైపు నడిపిన ఘనత రాజీవదేనన్నారు. యువతకు 21ఏళ్లనుండి 18ఏళ్లకే ఓటుహక్కు, మహిళలకు రిజర్వేషన్లు, పంచాయతీ రాజ్ వ్యవస్థ వంటివి రాజీవ్ గాంధీ కాలంలోనే అమలులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ మెండు నిశాంత్, గవల్లి శ్రీను, సయ్యద్ ఆలింబాబు, గుంటి ఆదినారాయణ పాల్గొన్నారు.

బాపట్లలో విలేకర్లతో పనబాక లక్ష్మీ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో తాము అధికారానికి వస్తామని చెప్పారు. అధికారానికి వస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామని చెప్పారు.