Home క్రైమ్ కొడుకుపై తండ్రి క‌త్తితో దాడి, హ‌త్య‌

కొడుకుపై తండ్రి క‌త్తితో దాడి, హ‌త్య‌

371
0

చీరాల : రోజు త‌ప్ప‌తాగి ఇంటిలో గొడ‌వ ప‌డుతుంటాడు. రోజుటిలాగే తాగి ఇంటికెళ్లి భార్య‌పై దాడి కాల్పడ్డాడు. అడ్డువెళ్లిన కొడుకును క‌త్తితో పొట్ట‌లో పొడిచాడు. పేగులు బ‌య‌టికొచ్చేంత‌గా పొడ‌వ‌డంతో కొడుకు మృతి చెందిన ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా చీరాల మండ‌లం జాండ్ర‌పేట సాయిబాబ మందిరం స‌మీపంలో సోమ‌వారం చోటు చేసుకుంది.

సాయిబాబగుడి స‌మీపంలో నివాసం ఉంటున్న ఎస్‌కె బుజ్జి మ‌ద్యం తాగిన మ‌త్తులో అత‌ని భార్య‌పై దాడిచేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ప్ర‌య‌త్నంలో కొడుకు బాజీ అడ్డు వెళ్ల‌డంతో కొడుకుపై క‌త్తితో దాడి చేశాడు. దాడిలో 19ఏళ్ల‌ బాజీ క‌డుపులో క‌త్తిపోట్లు ప‌డ‌టంతో పేగులు బ‌య‌టికి వ‌చ్చి తీవ్రంగా ర‌క్త‌స్రావ‌మైంది. వెంట‌నే బాదితుడు బాజీని చీరాల ప్ర‌భుత్వ వైద్య‌శాల‌కు త‌ర‌లించారు. ప్ర‌ధ‌మ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్ర‌భుత్వ వైద్య‌శాల‌కు సిఫార్సు చేయ‌డంతో గుంటూరు తీసుకెళుతుండ‌గా మార్గ‌మ‌ద్యంలో ప‌త్తిపాడు స‌మీపంలో మృతి చెందిన‌ట్లు మృతుని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.