Home జాతీయం వామ్మో… ఆ లక్షల మంది కలిసి సీఎం ఇంటిపైకి వెళ్లి…!

వామ్మో… ఆ లక్షల మంది కలిసి సీఎం ఇంటిపైకి వెళ్లి…!

498
0

బొంబాయి : దేశంలో కనీవినీ ఎరుగని విధంగా మహారాష్ట్ర రైతులు ఉద్యమిస్తున్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలని, రైతును బతికించాలనే నినాదంతో ప్రారంభం అయిన మహా రైతు.. మహా పాదయాత్ర ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. బుధవారం 30వేల మందితో ప్రారంభం అయిన పాదయాత్ర.. అడుగులో అడుగు వేస్తూ.. లక్షల మందిని తనలో కలుపుకుంటోంది. ఇప్పటికే 100 కిలోమీటర్లు సాగిన పాదయాత్రకి దారి పొడవునా రైతులు మద్దతు ఇస్తున్నారు. వేల మంది రోజూ యాత్రలో పాల్గొంటున్నారు. దీంతో గంట గంటకి రైతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ ఉంది. వేలాది మంది రైతులకు అవసరం అయిన మంచినీళ్లు, ఆహార పదార్ధాలను దారి మధ్యలోని గ్రామస్తులు స్వచ్చంధంగా అందిస్తున్నారు. కూరగాయలు, పండ్లు, మంచినీళ్లు ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నారు జనం. నాసిక్ లో పాదయాత్ర ప్రారంభం అయినప్పుడు కేవలం వెయ్యి, రెండు వేల మంది మాత్రమే ఉన్నారు. గ్రామం గ్రామం దాటుతున్న కొద్దీ రైతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ కు చెమటలు పడుతున్నాయి. ముంబైకి పాదయాత్ర చేరుకునే సమయానికి కనీసం లక్ష మంది రైతులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. వారికి అవసరం అయిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అందాయి. పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే భద్రతా చర్యలు చేపట్టారు.

*పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు :* మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ముంబై వరకు పాదయాత్ర సాగుతోంది. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో ఈ యాత్ర ప్రారంభం అయ్యింది. *ఎంత దూరం :* 180 కిలోమీటర్లు ( ప్రతిరోజు 30కిలోమీటర్లు నడుస్తున్నారు )….. *ముంబైకి చేరుకునేది :* మార్చి 12వ తేదీ సోమవారం….. *రైతుల డిమాండ్లు :*. … *బ్యాంక్ రుణాలు రద్దు చేయాలి*…..… *పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి.*…… *వ్యవసాయ బావులు, బోర్ల కరెంట్ బిల్లులు రద్దు చేయాలి.*… *వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి.*…

2017 జూన్ లో మహారాష్ట్ర ప్రభుత్వం రూ.34వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తుందని ప్రకటించింది. ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. దీంతో ఒక వెయ్యి 753 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆల్ ఇండియా కిసాన్ సభ సెక్రటరీ రాజు దేశ్ అంటున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. రైతు కష్టాలు నేతలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టినట్లు వెల్లడించారాయన…..