Home బాపట్ల ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం కోసమే : ఎంఎల్‌ఎ కొండయ్య

ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం కోసమే : ఎంఎల్‌ఎ కొండయ్య

22
0

చీరాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని శాసన సభ్యులు మద్ధులూరి మాలకొండయ్య అట్టహాసంగా బుధవారం ప్రారంభించారు. మండలంలోని తోటవారిపాలెం పంచాయతీలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రజల అభిప్రాయం లేని పాలన ఉండకూడదని, ప్రజల సమస్యలు విని, పరిష్కరించే ప్రక్రియకు ఇది మొదటి మెట్టు’ అని అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు, రేషన్ పంపిణీ, విద్యుత్ సరఫరా, నీటి సమస్యలు తదితర అంశాలపై ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. వయో వృద్ధులు, మహిళలు, యువతతో ముచ్చటించి అభిప్రాయాలు నమోదు చేసుకుంటామని అన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. అధికారుల సమక్షంలో ప్రజల ఫిర్యాదులను నేరుగా విని, తక్షణ స్పందన ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం మరింత బలపడుతోందని అన్నారు. కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత, ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, టిడిపి మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, తోటవారిపాలెం అధ్యక్షులు బడిగింజల నాగరాజు, మాజీ ఎంపిటిసి నాదెండ్ల కోటేశ్వరరావు, గ్రామ ఇంచార్జిలు, నాయకులు పాల్గొన్నారు.