Home క్రైమ్ చీరాలలో అగ్నిప్రమాదం – రూ.2లక్షల ఆస్థి నష్టం

చీరాలలో అగ్నిప్రమాదం – రూ.2లక్షల ఆస్థి నష్టం

381
0

చీరాల : ప్రకాశం జిల్లా చీరాల బైపాస్ రోడ్డులోని ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో పలాస్టిక్ గోతాల పరిశ్రమ ఉన్నది. పరిశ్రమలో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. గమనించిన చుట్టుపక్కల ప్రజలు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.