Home ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అసమానతలే అసహన పరిదటితులకు మూలం జేవివి జిల్లా మహాసభలో ప్రో౹౹హరగోపాల్

ఆర్ధిక అసమానతలే అసహన పరిదటితులకు మూలం జేవివి జిల్లా మహాసభలో ప్రో౹౹హరగోపాల్

467
0

చీరాల : అసహన ధోరణలు – ఆర్ధిక మూలాల అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ చీరాల బాపనమ్మ కళ్యాణ మండపంలో జరిగిన జేవివి జిల్లా 15వ మహాసభలో మాట్లాడారు. జేవివి సభ్యులు సామాజిక అంశాలపై స్పందించి సమాజాభివృద్ధికి ఏదోఒకటి మేలు చేయాలన్న దృక్పథంతో పని చేస్తున్నారని భావిస్తున్నాను అన్నారు.

రాజకీయ నాయకులు ఏ స్వార్థంతో పని చేస్తున్నారు. సామాజిక అంశాలను సృజనాత్మకంగా పరిష్కరించుకునేందుకు రాజకీయాలు ఉపయోగపడాలి. కానీ నేడు రాజకీయాలే సమస్యాత్మకంగా మారాయి. రాజకీయాలు బ్రష్టు పడితే పరిస్కారం ఏమిటి. ఐన్స్టీన్ వంటి గొప్ప సైన్సు మేధావి నిరాశతో చనిపోయారు. నేను తయ్యారు చేసిన పరిజ్ఞానం మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే అణు బాంబును అమెరికా తయారు చేసి ప్రయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మనిషిలో ఒక సామాజికత, వంటరితనం ఉంటుంది. జేవివి సభ్యులకు సామాజికత కొద్దిగా ఎక్కువ ఉంటుంది.

కల్బుర్గి, పన్సారీ, గౌరిలంకేశ్ వంటి వారు కారణం లేకుండా ఎందుకు హత్య చేయబడ్డారు. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మనుషులంతా కలుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వంటరీ తనం అలవాటై సామాజికత కోల్పోయిన వ్యక్తులు ద్వేషం పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. దళితులను, ముస్లింలను చివరికి మహిళలను ద్వేషించడం, ఆవును చర్మం తీశారని చట్టాన్ని చేతిలోకి తీసుకుని కొట్టి చంపడం ఏమిటి? పశువు మనిషికన్నా గొప్పదా? ఆవు పాలు ఇచ్చేది మనిషి ఆరోగ్యంగా ఉండాలనే కదా. అలాంటిది ఇలా ఎదుకు జరుగుతుంది. మనిషి సామాజికంగా మారకపోతే జరిగే భయానక పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సత్యాన్ని మాట్లాడేవారిని హత్య చేయడం అంటే సమాజం ఎమవుతుంది.

అసహనం – ఆర్థికం నాణేనికి బొమ్మా, బొరుసు. అసహనం నుండే ఫ్రెంచ్ యుద్ధం వచ్చింది. ఆ విప్లవం నుండే స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు దేశంలో హిందు అసహనం వచ్చింది. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పనికిరాదని ఆర్ ఎస్ ఎస్ చెబుతుంది. రామరాజ్యం అంటే ఏమిటి. హిందు రాష్ట్రం అంటే ఏమిటి. హిందు మతంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి. కులాలు ఘనీభవిస్తున్నాయి. పెద్ద సమస్యగా మారింది. మేము చదువుకునేతప్పుడు రాడికల్, ఆర్ ఏస్ ఎస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలాలేదు.

సమాజం అభివృద్ధి చెందాలంటే కులం పొవాలని అంబెడ్కర్ అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రావాలన్నా, కమ్యూనిజం రావాలన్నా కులం పోవాలని చెప్పారు. మనిషిలో మానవత్వం పెంచాలని చెప్పారు. కులవివక్షలో ప్రతిభ సమాధి అవుతుందని, అలా కావడంతో పెట్టుబడిదారీ వ్యవస్థ రాదన్నారు. ఇతరులను గౌరవించకుండా అభివృద్ధి ఎలా సాధ్యం. పై వానిపై కోపం, కింది వానిపై ద్వేషం ఉన్నంతకాలం ఏ స్థాయిలో నైనా సామరస్యం రాదు. ఆధిపత్యం అనేది ఎక్కడికి తీసుకెళుతుంది. సంఘ పరివార్ కు సామాజిక పునాధి ఉంది. ప్రతి మనిషిలో తెలియకుండానే కొన్ని సామాజిక లక్షణాలు ఎక్కడో ఒకచోట ఉన్నాయి. అలాంటివి మార్చుకునేందుకు ముందు పోరాటం చేయాలి.

ఫాసిజానికి ఆర్ధిక ములాల్లోనూ పునాది ఉంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు భిన్నంగా జరిగింది. మార్క్స్ చెప్పిన ఆర్ధిక వ్యవస్థ ఇక్కడ లేదు. దీనిపై డిడి కోశాంబి చెప్పిన విధంగా ఉంది. దేశంలో ఇప్పటికి సామాజిక, ఆర్ధిక, ఉత్పత్తి సాధనాలపై విప్లవం జరగలేదు. పాత వ్యవస్థపై కొత్త వ్యవస్థ నిర్మాణమైనది.

హిందుగా చనిపోను అని జీవిత కాలం హిందు మతంలోని అసమానతలపై పోరాటం చేసిన అంబెడ్కర్ హిందువని చెప్పేందుకు బిజెపి ఒక పుస్తకం ప్రచురించి తంటాలు పడుతుంది.

తొలుత అధికారానికి వచ్చిన ఇందిరాగాంధీ పెదరికంపై మాట్లాడారు. సంకీర్ణ ఆర్ధిక వ్యవస్థ దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందని 1988లో ఇందిరాగాంధీ ఆదిశగా ఉత్పత్తి పెంచేందుకు హరిత విప్లవం తీసుకొచ్చింది. ఆతర్వాత దిగుమతులకు అనుమతి ఇచ్చారు. విదేశీ అప్పు పెరిగింట్లే అదే స్థాయిలో దేశభక్తి పేరుతో బిజెపి రాజకీయాలు పెరుగాయి. ఆర్ధిక అసమానతలు ప్రస్తావనకు రాకుండా ఏమి తినాలి, ఏ దుస్తులు ధరించాలి, రామమందిరం ఇలా సాంస్కృతిక ఇద్రేకాలను రెచ్చగొట్టి అసహన పెంచుతున్నారు. ఆర్థిక అస్తిత్వం నుండే మతం, కులం ముందుకు వస్తాయి. ఫాశిజం రాజకీయాలు మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని చిదిమేస్తున్నాయి. అమానవీయ సమాజ నిర్మాణాన్ని మార్చాలసిన ఉద్యమం రావాలి. అందుకు కృషి చేయాలని అన్నారు.

జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభల ప్రారంభ సూచికగా జాతీయ జెండాను సీనియర్ నాయకులు ఏవి పుల్లారావు, జేవివి జెండాను డాక్టర్ ఎన్ రంగారావు ఆవిష్కరించారు. సభలో జేవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు, రిటైర్డ్ ఎంఇఓ జంగా మోహనరావు, జేవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, గవిని నాగేశ్వరావు, కె వీరాంజనేయులు, వంటిపెంట మాలకొండారెడ్డి, కెవిపిఎస్ అధ్యక్షుడు ఎల్ జయరాజు, జేవివి జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం, సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు, జేవివి నాయకులు డి నారపరెడ్డి, బి పిచ్చయ్య, డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.