Home క్రైమ్ మ‌ద్యం దుకాణాల్లో గొడ‌వ‌ల‌కు య‌జ‌మానులే బాధ్య‌త వ‌హించాలి : డిఎస్‌పి

మ‌ద్యం దుకాణాల్లో గొడ‌వ‌ల‌కు య‌జ‌మానులే బాధ్య‌త వ‌హించాలి : డిఎస్‌పి

366
0

చీరాల : మ‌ద్యం దుకాణాల్లో ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మ‌ద్యం దుకాణాల య‌జ‌మానుల‌కు డిఎస్‌పి వ‌ల్లూరు వెంక‌టేశ్వ‌ర్లు సూచించారు. ఇటీవ‌ల ఒక‌టో ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మ‌ద్యం దుకాణంలో జ‌రిగిన చిన్న‌పాటి వివాదం పోలీసు కేసుల వ‌ర‌కు వెళ్ల‌డంతో మ‌ద్యం దుకాణాల య‌జ‌మానుల‌తో డిఎస్‌పి గురువారం స‌మావేశం నిర్వ‌హించారు. కొట్లాట‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ఆదేశించారు. ప్ర‌తి షాపులో సిసి కెమేరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని చెప్పారు. మైన‌రుల‌కు మ‌ద్యం విక్ర‌యాలు చేయ‌కూడ‌ద‌ని ఆదేశించారు. క‌స్ట‌మ‌ర్ల ప్ర‌వ‌ర్త‌న‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని సూచించారు. స‌మావేశంలో ఒక‌టో ప‌ట్ట‌ణ సిఐ వి సూర్య‌నారాయ‌ణ‌, ఎక్సైజ్ సిఐ ఉన్నారు.