అమరావతి : ఈ ఏడాది ఇక డీఎస్సీ లేనట్లేనా? ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చిన, మంత్రివర్గం ఆమోదం తెలిపినా అడుగు ముందుకు పడనిది అందుకేనా? ఈ ప్రశ్నలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఏపీపీఎస్సీకి సంబంధించిన 10,000 పోస్టులకు మత్రమే ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చారన్నది దాని సారాంశం. ఇప్పటివరకూ డీఎస్సీ ప్రకటనలో జాప్యనికీ ఆర్ధిక శాఖ భారంగా భావించడమే కారణమన్నది ఆ ప్రచారంలోని మరో అమాసం. ఈ ఏడాది ఆర్థిక భారం పేరుగుతున్నందున 9,300 టీచర్ పోస్టులకు అనుమతి ఇచ్చే ప్రశక్తే లేదు అని ఆర్ధిక శాఖ తేల్చి చేప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆందోళనలో నిరుద్యోగ అభ్యర్థులు
డిఇ డి, బీఈ డి నిరాద్యోగ విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఆశలు పెంచుకుని అప్పులు చేసి శిక్షణ తీసుకున్న అభ్యర్థులు సూరుమంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ అనుమతితో క్యాబినెట్ ముందుకు వచ్చినప్పటికీ ఆర్థిక శాఖ అనుమతి లేదని ప్రచారం జరగడం నిరుద్యోగుల్లో ఆందోళనకు నిదర్శనం. నిరాద్యోగ భ్రుతి రూ.1,000 చేప్పున 12,00000 మందికి మత్రమే ఇస్తామని ప్రచారం జరగడాన్ని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది.