Home ప్రకాశం జగన్ పై దాడి ఘటనను సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి

జగన్ పై దాడి ఘటనను సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి

431
0

చీరాల : విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసిపి నేత జగన్ పై జరిగిన హత్యాయత్న దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని కోరుతూ అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో గడియారస్తంభం సెంటర్లో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి మాట్లాడారు. ప్రయపక్ష నేతకు రక్షణ కల్పించలేని ప్రభుత్వ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై ఆరోపణలు చేయడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు.

దీక్షలను ఒకటో పట్టణ ఎస్ఐ వి హరిబాబు అడ్డుకున్నారు. దాక్షలకు కూర్చొన్న అమృతపాణి యువసేన కార్యకర్తలు యాతం క్రాంతికుమార్, పేర్లి నాని, ఎన్ రాజ్ కుమార్, కనపర్తి బజ్జిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ అమృతపాణి పోలీసులతో అరెస్టుపై చర్చించారు. ఆయన వెంట కౌన్సిలర్ పొదిలి ఐస్వామి, నాయకులు ఉన్నారు.