Home ప్రకాశం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగిని అరెస్ట్ చేసిన పోలీసులపై చర్యలు కోరుతూ వినతి

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగిని అరెస్ట్ చేసిన పోలీసులపై చర్యలు కోరుతూ వినతి

374
0

చీరాల : అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగిని అధికార పార్టీ నేతల వత్తిడితో పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యశాల అధికారి డాక్టర్ తిరుపాలుకు వినతి పత్రం అందజేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రోగిని డాక్టర్ అనుమతి లేకుండా పోలీసులు ఎలా తీసుకెళతారని అన్నారు. హాస్పిటల్లో నుండి తీసుకెళ్లి ఎక్కడో పట్టుబడినట్లు రిపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అప్రజాస్వామికమో అర్ధం చేసుకోవాలని కోరారు.

ఈపురుపాలెం చర్చివద్ద జరిగిన చిన్న వివాదంలో అధికార పార్టీ వారి వత్తిడితో తమ పార్టీ కార్యకర్త దేవరపల్లి కుమార్ బాబును ఎస్ఐ అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కిడ్నీ జబ్బుతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తిని తమ కళ్ళముందే తీసుకెళ్లి ఎక్కడో దొరికినట్లు తప్పుడు రిపోర్ట్ చూపారని ఆరోపించారు. హాస్పటల్ నుంచి వైద్యం జరుగుతున్న వ్యక్తిని రాత్రి 11.30 గంటలకు ఎత్తుకు వెళ్లిపోయారని చెప్పారు. వైద్యశాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హాస్పిటల్ సూపరిండిట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులను కలవనున్నట్లు చెప్పారు.