Home ప్రకాశం ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి జులై 22న రాజకీయ సదస్సు

ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి జులై 22న రాజకీయ సదస్సు

332
0

చీరాల : ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి సిపిఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాజకీయ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలతో సదస్సు జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య పేర్కొన్నారు. బాపనమ్మ కల్యాణ మండపంలో గురువారం జరిగిన సిపిఎం ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి అధికార టీడీపీ ఇచ్చిన 9వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. గడిచిన నాలుగేళ్లలో 11సార్లు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ప్రస్తావించకుండా కొత్త వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టిడిపి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో టిడిపి, బిజెపి, వైసిపి, కాంగ్రెసు ఆర్ధిక విధానాలకు ప్రత్యామ్నాయంగా సిపిఎం, సిపిఐ తోపాటు కలిసివచ్చే ఇతర రాజకీయ, సామాజిక సంస్థలతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా జిల్లాలో ఈ నెల 22న ఒంగోలులో జరిగే ప్రత్యామ్నాయ రాజకీయ సదస్సును జయప్రదం చెయాలని కోరారు. సమావేశంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు, ఎమ్ వసంతారావు, డి నాగేశ్వరరావు, గవిని నాగేశ్వరరావు, లింగం జయరాజు, కె ఎల్లమంద, పి సాయిరాం, ఏలింగర్, చిరంజీవి, ఏవి రమణ, గోసాల సుధాకర్, ఎమ్ సత్యమూర్తి, కరి ఆంజనేయులు, డి విజయభాస్కర్, సత్యవేలు, జి గంగయ్య పాల్గొన్నారు.