వేటపాలెం (Vetapalem): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే కొండయ్య (Chirala MLA Kondaiah) అన్నారు. వేటపాలెం మార్కెట్ సెంటర్‌లో షకీల్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టిడిపిలో చేరాయి. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నమ్మకంతో పాటు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్యే కొండయ్య, టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం మహేంద్రనాథ్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ పాల్గొన్నారు.






