చీరాల : కుందేరులో డయ్యింగ్ వ్యర్ధాలు వదలడంతో దుర్వాసన పెరిగిందని ఎల్‌బిఎస్ నగర్లోని కుందేరు ఒడ్డున నివాసం ఉంటున్న పేదలు ఆరోపించారు. కుందేరు మురుగు నీటి పారుదలకు చర్యలు తీసుకుని, కుందేరులో డయ్యింగ్ వ్యర్ధాలు వదులుతున్నవారిపై చర్యలు తీసుకోవాలసి సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురాడు డిమాండు చేశారు. కుందేరుకు ఇరువైపులా నివాసం ఉంటున్నవాళ్లు కనీసం వాడుక అవసరాలకు కూడా నీటి కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ధర్నా అనంతరం కమీషనర్ షేక్ ఫజులుల్లాకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎవి రమణ, లింగం జయరాజు పాల్గొన్నారు.