Home ప్రకాశం సిపిఎం ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యామ్న‌య రాజ‌కీయ వేదిక : సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి పూనాటి ఆంజ‌నేయులు

సిపిఎం ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యామ్న‌య రాజ‌కీయ వేదిక : సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి పూనాటి ఆంజ‌నేయులు

387
0

చీరాల : సిపిఎం కార్య‌క‌ర్త‌ల స‌మావేశం కెకెసి కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వ‌హించారు. స‌మావేశానికి సిపిఎం ప్రాంతీయ నాయ‌కులు దేవ‌తోటి నాగేశ్వ‌ర‌రావు అధ్య‌క్ష‌త వ‌హించారు. స‌మావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. అభివృద్ధి మొత్తం ఓకే చోట కేంద్రీకృత మైనందువల్ల మిగిలిన జిల్లాలు అత్యంత వెనుకబాటుకు గురౌతాయని చెప్పారు.

35వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న‌ప్ప‌టికీ నేటికీ ఏక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, వైసిపిలకు ప్ర‌త్యామ్న‌యంగా నూతన విధి విధానాలతో క్రొత్త రాజ‌కీయ వేదిక‌ ఎర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనసేన, సీపీఐలను కలుపుకుని ముందుకు వెళ‌తామ‌న్నారు. చీరాల ప‌రిస‌ర ప్రాంతంలో డైయింగ్ పరిశ్రమల వలన భూగ‌ర్భ జ‌లాలు కలుషితం అవుతున్నాయ‌ని సిపిఎం చీరాల‌ ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌ బాబురావు అన్నారు. వీటిపై భ‌విష్య‌త్‌లో ఆందోళ‌న‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. కార్యక్రమంలో లింగం జయరాజ్, జి ఆదిత్య, సాయిరాం, చరిత, మహిళా కార్యకర్తలు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.