టంగుటూరు : వివిధ గ్రామాల్లో వాటర్షెడ్ పధకం క్రింద జరిగిన పనులలో భారీ అవినీతి జరిగినదని గతంలో వైసిపి నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్ బాబు చేసిన ఆరోపణలు వాస్తవమేనని డ్వామా అధికారులు చేసిన సోషల్ ఆడిట్ లోతేలినట్లు వైసిపి మండల నాయకులు మల్లవరపు రాఘవరెడ్డి, ఆనం సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. యం నిడమలూరు లో రూ.15లక్షలు, కారుమంచిలో రూ.7లక్షలు, టంగుటూరులో రూ.5లక్షలు, జయవరంలో రూ.4లక్షలు మొత్తం రూ.31లక్షలు అవినీతి జరిగిందని అధికారులు వెల్లడించిన విషయం తెలిసినదేనన్నారు.
గ్రామాల్లో వాటర్షెడ్ పధకం క్రింద టిడిపి నాయకుల ద్వారా భారీ అవీనీతి జరుగుతున్నదని ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ జరపాలని అధికారులకు విన్నవించిన సందర్బాలు అనేకం ఉన్నాయన్నారు. ఎట్టకేలకు ఇప్పటికైనా అధికారులు స్పందించినందుకు సంతోషమని పేర్కొన్నారు. అధికారులు అలసత్వం వహించకుండా దుర్వినియోగం అయిన నగదు మొత్తాన్ని రికవరీ చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో వైయస్సార్ సిపి జిల్లా కార్యదర్శి చింతపల్లీ పేరయ్య, వైఎస్సార్ సిపి రాష్ట్ర సేవాదళ్ జాఇంట్ సెక్రటరీ కనపర్తి శేషారెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మీ నారాయణరెడ్డి, భరత్ రెడ్డి, సురేంద్రరెడ్డి, కసుకుర్తి వెంకటేశ్వర్లు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, వాకా శ్రీకాంత్ రెడ్డి, వాకా బాలక్రిష్ణారెడ్డి, తిప్పగుడిసె రమేష్, అనంతవరం మాజీ సర్పంచ్ కసుకుర్తి సుందరరావు, కందులూరు గ్రామ వైసిపి నాయకులు ఉప్పలపాటి సత్యనారాయణ రాజు, ఉప్పలపాటి రామరాజు పాల్గొన్నారు.