చీరాల : పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈనెల 10న పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా జరుగుతున్న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను కోరారు. బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో పెట్రోలు దరలను కూరగాలయ ధరల్లాగా ఏరోజుకు ఆరోజు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ప్రజలపై పన్నులు, ధరల భారం వేసి అంబానీలకు ఆస్థులు కూడబెట్టే బిజెపి విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి వస్తే పెట్రోలు ఉత్పత్తుల ధరలు నియంత్రిస్తుందని చెప్పారు. దీనితోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు పేర్కొన్నారు.