బాపట్ల : పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్, వామపక్షాలు భారత్‌కు పిలుపు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, వాపమపక్షాలు, జనసేన పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. అయితే బాపట్లలో టిడిపి ఎంఎల్‌సి అన్నం సతీష్‌ప్రభాకర్ నాయక్తవంలో నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ బిజెపి చేస్తున్న ఇంధన వనరుల విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు బంద్ సందర్భంగా దుకాణాలు మూయించి, బస్సులు నిలిపేసి బంద్ చేయిస్తూ ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు టిడిపి కార్యకర్తలు కూడా బంద్‌లో పాల్గొనడంతో పట్టణం బంద్ సంపూర్ణమైంది. ఇరుపార్టీలు రోడ్డుపైకి రావడం చర్చనీయాంశయైంది.