Home ఆంధ్రప్రదేశ్ గిడుగుకు ఘ‌న నివాళి

గిడుగుకు ఘ‌న నివాళి

417
0

చీరాల : వాడుక బాష‌లో తెలుగును ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంలో విశేష కృషి చేసిన గిడుగు రామ‌మూర్తి పంతులు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి వైఎ ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల‌లో నివాళుల‌ర్పించారు. తెలుగు బాషా దినోత్స‌వ స‌భ‌లో ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సిహెచ్ ర‌మ‌ణ‌మ్మ మాట్లాడారు. కార్య‌క్ర‌మంలో విశ్రాంత ప్రిన్సిపాల్ బ్ర‌హ్మానంద‌రెడ్డి, అధ్యాప‌కులు పాల్గొన్నారు.

విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో తెలుగు బాషా దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. స‌భ‌కు ప్రిన్సిపాల్ మ‌న్నేప‌ల్లి బ్ర‌హ్మ‌య్య అధ్య‌క్ష‌త వ‌హించారు. స‌భ‌లో సెక్ర‌ట‌రీ అండ్ క‌ర‌స్పాండెంట్ అడ్డ‌గ‌డ వేణుగోపాల్ మాట్లాడారు. ప‌ర‌బాష‌మోజులో ప‌డి మ‌ధుర‌మైన మాతృబాష‌ను మ‌రువొద్ద‌ని చెప్పారు. ఆంగ్లేయులుసైతం మెచ్చిన బాష తెలుగు అని పేర్కొన్నారు. వ్య‌వ‌హారిక బాషోద్య‌మానికి మూల‌పురుషుడైన గిడుగు రామ‌మూర్తి పంతులు తెలుగు బాషాభివృద్దికి చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివ‌న్నారు. గిడుగు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌లర్పించారు. కార్య‌క్ర‌మంలో తెలుగు విభాగాధిప‌తి జె శ్యామ‌లాదేవి, డాక్ట‌ర్ ఎల్‌జె నాయుడు, టి పోల‌య్య పాల్గొన్నారు.