Home క్రీడలు పిల్ల‌ల మ‌ద్య‌లో పిల్ల‌లా పంతుళ్లు

పిల్ల‌ల మ‌ద్య‌లో పిల్ల‌లా పంతుళ్లు

1197
0

వేట‌పాలెం : వాళ్లంతా ఉపాధ్యాయులు. ప్ర‌తినిత్యం పిల్ల‌ల‌ను ఆడిస్తూ… బోధిస్తూ… అవ‌స‌ర‌మైతే దండిస్తూ బిజీ బిజీగా క‌నిపిస్తారు. అలాంటి ఉపాధ్యాయులు ఒక్క‌సారి పిల్ల‌ల మ‌ద్య‌లో పిల్ల‌లైతే ఎలా ఉంటుంది. అచ్చం అదే జ‌రిగింది. ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా కొత్త‌పేట జెడ్‌పి ఉన్న‌త పాఠ‌శాల ఉపాధ్యాయుల‌కు ఆట‌ల పోటీలు నిర్వ‌హించారు. విద్యార్ధులంతా చుట్టూ చేసి ఉపాద్యాయుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ కేక‌లు వేస్తుంటే ఉపాధ్యాయులు మాత్రం పిల్ల‌లా మ్యూజిక‌ల్ ఛైర్స్‌, గ‌న్నీబ్యాగ్స్ పోటీల్లో పాల్గొన్నారు. పాఠ‌శాల వ్యాయామ ఉపాధ్యాయులు యు హ‌నుమంత‌రావు, ఎం వెంక‌ట్రావు ఆట‌ల పోటీలు నిర్వ‌హించారు. పోటీల్లో గెలుపొందిన ఉపాధ్యాయుల‌కు ఉపాధ్యాయ దినోత్స‌వ స‌భ‌లో బ‌హుమ‌తులు ఇవ్వ‌నున్నారు.