చీరాల : ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిన సిబ్బంది అందుబాటులో లేకుండా పేదలకు వైద్యసేవలు అందించడం ఎలా సాధ్యమని ఎంపిపి గవిని శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేవాంగపురి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఉన్న సిబ్బందిలో ఒకరు విధుల్లో ఉంటే మరొకరు బయట ఉంటే సేవలందించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బుధవారం రోజు వ్యాక్షన్లు, అంగనవాడీ కేంద్రాల్లో వ్యాక్సిన్‌లు ఇవ్వడానికే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు. విషజ్వరాల సీజన్‌లో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. కుందేరు ఒడ్డున ఉన్న రామిరెడ్డినగర్, సుబ్బారావుకాలనీ, కృష్ణనగర్‌లో దోమల నివారణ, పారిశుద్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. గర్భిణీ మహిళలు, బాలింతలు, పసిపిల్లల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఆయన వెంట జెడ్‌పిటిసి పృధ్వి అరుణ, మాజీ ఎంపిటిసి పృద్వి ధనుంజయ, కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఎంపిటిసి బండారు సుధ, హెచ్ఆర్‌సి సభ్యులు ఎరిచర్ల స్వామిదాసు ఉన్నారు.