Home బాపట్ల ఐక్యతతో ఆర్థికంగా ఎదగాలి : శాసన సభ్యులు ఎంఎం కొండయ్య

ఐక్యతతో ఆర్థికంగా ఎదగాలి : శాసన సభ్యులు ఎంఎం కొండయ్య

66
0

బాపట్ల : యాదవులు ఐకమత్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని చీరాల శాసన సభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. సూర్యలంక తీరం నగర వనంలో బాపట్ల యాదవ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన యాదవ కార్తీక వన సమారాధనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యలంక తీరాన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అన్నారు. అనంతరం యాదవ సంఘాల నాయకులు కొండయ్యను సన్మానించి సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో టిడిపి బాపట్ల పట్టణ అధ్యక్షుడు గోలపల శ్రీనివాసరావు, మద్దిబోయిన సోమరాజు, పులి వాసు, పిన్నిబోయిన ప్రసాద్, తోట నారాయణ పాల్గొన్నారు.