చీరాల : పట్టణ ప్రజల సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని కోరారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వేంకటేశ్వర కళ్యాణ మండపం రోడ్లులో విధి లైట్లు వెలగట్లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన రహదారిలో లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దోమల మందు ఫాగింగ్ చేయాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు దోమల ఉత్పత్తి పెరిగి డెంగ్యూ, మలేరియా వచ్చే అవకాశం ఉందని అన్నారు. డ్రైనేజీలో వ్యర్థాలు తొలగింపుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మురికి నీరు నిలువ వుండడం వలన దోమల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. అధికారులు తక్షణమే పట్టణంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో షేక్ ఇబ్రహీం, షేక్ అబ్దుల్ ఖాదర్, షేక్ భాజీ, సయ్యద్ అఫ్జల్, శ్రీనివాసరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.