నూరుశాతం ఫలితాలతో శ్రీమతి రేణుకాదేవి శ్రీవాసవి హైస్కూల్
శ్రీమతి రేణుకాదేవి శ్రీవాసవి హైస్కూల్ విద్యార్ధులు నూరుశాతం ఫలితాలు సాధించారు. 36మంది విద్యార్ధులకు 36మందీ ఉత్తీర్ణులయ్యారు. గత 41సంవత్సరాలుగా వరుసగా నూరుశాతం ఫలితాలు సాధిస్తున్న ఏకైక విద్యాసంస్థని పాఠశాల ప్రిన్సిపాల్ ఊటుకూరి వెంకట్రావు పేర్కొన్నారు. 9.8ముగ్గురు, 9.7ఒకరు, 9.5ఇద్దరు, 9.3ముగ్గురు, 9.2నలుగురు, 9.0ఇద్దరు, 8.5జిపిఎ 20మంది, 5.7ఒకరు సాధించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన విద్యార్ధులను అభినందించారు.
10కి 10జిపిఎ సాధించిన శ్రీసాయి హైస్కూల్ విద్యార్ధులు
ఎప్పటిలాగానే తమ పాఠశాల విద్యార్ధులు 10కి10జిపిఎ సాధించారని పేరాల శ్రీసాయి హైస్కూల్ ప్రిన్సిపాల్ వెంకట్రావు తెలిపారు. తమ పాఠశాలకు చెందిన టి తేజేష్, ఆర్ వెంకటేష్ 10కి 10జిపిఎ సాధించారని తెలిపారు.
రాఘవేంద్రకు 10కి10 జిపిఎ
పాపరాజుతోటలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్ధిని 10కి 10జిపిఎ సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గవిని మణికుమార్ తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులందరూ ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
నూరు శాతం ఫలితాలతో ఎన్‌పిఆర్ విద్య స్కూల్ విద్యార్ధులు
ఎన్‌పిఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్ధులు నూరు శాతం ఫలితాలు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ సాహెబ్ తెలిపారు. 32మంది విద్యార్ధుల్లో డి వెంకటప్రసాద్, బి మోహన్ 10కి10జిపిఎ సాధించినట్లు తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన అభినందన సభలో విద్యా విద్యాసంస్థల ఛైర్మన్ నారిపెళ్ల ప్రకాశరావు విద్యార్ధులను, అద్యపాకులను అభినందించారు. సాధారణ ఫీజులతో ఆహ్లాదరకమైన వాతావరణంలో ఇంతటి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యాకాలేజి ప్రిన్సిపాల్ పి తులసీకృష్ణ, కె రమేష్, ఎస్ఎస్ఎన్‌వి ప్రసాద్, షేక్ సుభాని, కె సంపత్‌కుమార్ పాల్గొన్నారు.