Home TV News Chinni Serial Today ఏప్రిల్ 19 ఎపిసోడ్: ఒక్కసారి నాన్నతో మాట్లాడమ్మా.. లేదంటే!! తెగించిన చిన్ని

Chinni Serial Today ఏప్రిల్ 19 ఎపిసోడ్: ఒక్కసారి నాన్నతో మాట్లాడమ్మా.. లేదంటే!! తెగించిన చిన్ని

11
0

Chinni Serial April 19th Episode: పాపం చిన్ని. ఆమె పుట్టుకే ఓ ప్రశ్నార్ధకం. గొప్ప ఇంట్లో పుట్టి పెరగాల్సిన చిన్ని. జైలు గదుల్లో అమ్మ పురిట్లో నుంచి బయటకు వచ్చింది. ఇక తల్లి, తండ్రి పక్కనే ఉన్నా కూడా. వాళ్ల ప్రేమని పొందలేని పరిస్థితి. అమ్మ, నాన్న కలిసిపోవాలని వాళ్లతో కలిసి ఆనందంగా ఉండాలని కలలుకంటున్న చిన్ని నేటి ఎపిసోడ్‌లో ఏం చేసిందంటే.

చిన్ని సీరియల్ నిన్నటి ఎపిసోడ్‌లోని ట్విస్ట్‌లు అద్దిరిపోయాయి. లాయర్ హరికి ఉషే నా చెల్లెలు కావేరి అనే నిజాన్ని సత్యంబాబు చెప్పేస్తాడు. మరోవైపు ఉష టీచరే మా అమ్మ కావేరి అని చందుకి చిన్ని నిజంచెప్పేస్తుంది. ఇక ఉష టీచరే నా అత్తమ్మా అంటూ వెళ్లి అత్తా అని కావేరిని చందు పలకరించడం హైలైట్ కాగా.. నేటి (ఏప్రిల్ 19) రాత్రి ప్రసారమైన 252 ఎపిసోడ్‌లో ఏమైందో చూద్దాం. మామయ్యా అంటూ బాలరాజు దగ్గరకు పరుగు పరుగున వెళ్తుంటాడు చందు. ఇంతలో కావేరి అడ్డుగా వచ్చి ఏంట్రా ఎక్కడికి అంత కంగారుగా వెళ్తున్నావని అడుగుతుంది. మా మామయ్య వచ్చాడు టీచర్ అని బాలరాజుని చూపిస్తాడు చందు. దాంతో కావేరి.. ‘మామయ్య ఏంట్రా మామయ్యా’ అని ఫైర్ అవుతుంది. అదేంటి టీచర్.. చిన్ని మా అత్త కూతురు. చిన్నికి నాన్న అంటే నాకు మామయ్యే అవుతాడు కదా’ అని అంటాడు చందు. ‘అయితే.. మామయ్యా అని అనాలా? ఆయనేం అమెరికా నుంచి ఫ్లైట్‌లో దిగిరాలేదు కదా. అంత కంగారెందుకు అని అంటుంది కావేరి. ఫ్లైట్‌లో వచ్చినా ఆటోలో వచ్చినా మామయ్యపై ప్రేమ తగ్గదు కదా టీచర్. మా మధ్య తరగతి ప్రేమాభిమానాలు మీకు అర్థం కావులే టీచర్.. అర్థం కావు’ అని సినిమా డైలాగ్‌లు చెప్తాడు చందు.

అత్త చేతిలో అల్లుడికి అప్పడం.
దాంతో కావేరి ఏంట్రా సినిమాలు ఎక్కువ చూస్తుంటావా? అని చెవి మెలి పెడుతుంది. ఇక దూరం నుంచి చూసి బాలరాజు తెగ నవ్వుకుంటూ చందు దగ్గరకు వెళ్తాడు. రండి రండి వెళ్దాం అని అంటాడు బాలరాజు. ఏం అవసరం లేదు. మనం కలిసి వెళ్దాం చిన్నీ అని అంటుంది కావేరి. ఏంటీ టీచర్ నా పొట్టకొడతారా? అని అంటాడు బాలరాజు. పొట్ట కొట్టడం కాదు. కాళ్లు చేతులు విరగ్గొడతాం అని అంటుంది కావేరి. ‘మేం చూస్తూ ఊరుకుంటామా? మొహం పగలకొడతాం’ అని అంటాడు బాలరాజు. ఏంటీ కొడతావా? కొట్టు కొట్టు అంటూ బాలరాజుపైకి దూసుకొస్తుంది కావేరి.

రేయ్ రారా కొట్రా.. కొట్టు
కొట్రా.. కొట్టు అని బాలరాజుని వెనక్కినెట్టేస్తుంది. ఇక ఇద్దరూ కలబడటంతో చందు వచ్చి విడదీస్తాడు. అయితే చందుని కిందపడేసి మరీ కొట్లాడతారు కావేరి, బాలరాజులు. ఇక చిన్ని వచ్చి సర్లే రాజు.. ఈపూటకి నేను టీచర్‌తో వస్తానులే అని అంటుంది. నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నా అంటూ చందుని తీసుకుని వెళ్లిపోతాడు బాలరాజు. ఇక చిన్ని.. కావేరి చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోతుంది. ఆ పేపర్‌పై అమ్మ, నాన్న నేను అంటూ బొమ్మ వేసింది చిన్ని. ఆ బొమ్మని చూసిన కావేరి కూతురికి క్లాస్ పీకుతుంది.

ముక్క ముక్కలు చేసిన కావేరి..
వాడ్ని తీసుకొచ్చి నాన్నా అని పనిచయం చేశావ్. మొన్న గుడిలో మా ఇద్దరి పేర్లు నువ్వే రాశావ్. ఎందుకు ఇలా చేస్తున్నావ్? అని నిలదీస్తుంది కావేరి. ఎంతైనా నాన్న కదమ్మా అని చిన్ని అంటే.. ‘ఆపు.. వాడ్ని నాన్నా అని అనొద్దు. వాడు ఎంత దుర్మార్గుడో చెప్పినా కూడా అర్థం చేసుకోవేంటి? వాడు వల్ల ఏం కోల్పోయామో చెప్పినా నీకు అర్థం కాదా? ఇంకోసారి వాడి ప్రస్తావన నా దగ్గర తీసుకొస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ ఆ బొమ్మని ముక్క ముక్కలుగా చింపేసి విసిరికొడుతుంది కావేరి.

మహి బర్త్ డే పార్టీ.. స్కెచ్ వేసిన నాగవల్లి, దేవా
ఇక నాగవల్లి, దేవేంద్ర వర్మ ఇద్దరూ కలిసి మరో ప్లాన్ వేస్తారు. మహి బర్త్ డేకి సత్యం ఫ్యామిలీ అందర్నీ పిలుద్దాం. ఉష అలియాస్ కావేరిని కూడా పిలుద్దాం. ఆ బర్త్ డే పార్టీలో ఉషే కావేరి అని తేల్చేద్దాం అంటూ నాగవల్లికి ప్లాన్ చెప్తాడు. వావ్ ప్లాన్ అద్దిరిపోయింది బావా అంటూ చేతులు కలిపేస్తుంది నాగవల్లి. మరోవైపు.. కావేరి చేసిన పనికి అలుగుతుంది చిన్ని. అది గమనించిన కావేరి.. చిన్ని కోసం ఐస్ క్రీమ్‌లు తెచ్చి ఇస్తుంది. వాటిని వద్దని విసిరికొడుతుంది చిన్ని. దాంతో కావేరికి కోపం వస్తుంది. సారీ అమ్మా కింద పడుతుందని అనుకోలేదు అని చిన్ని చెప్తున్నా అర్థం చేసుకోదు కావేరి.

నీకో దండం.. నీక్కూడా దండం..
నాన్న గురించి ఆలోచిస్తుంటే నాకేం తినబుద్ది కావడం లేదమ్మా అందుకే వద్దన్నా అని చిన్ని అనడంతో.. నాన్నా నాన్నా నాన్నా వాడు నీకు నాన్నే కాదు.. వాడి గురించి మాట్లాడొద్దంటే వినవేంటి? అని ఫైర్ అవుతుంది కావేరి. నాన్న మారాడని తెలిసిన తరువాత కూడా నాన్న గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను అమ్మా.. అందరి పిల్లల్లాగే అమ్మనాన్నలతో కలిసి ఉండాలని నాకూ ఉంటుంది కదమ్మా. నాన్నని అర్థం చేసుకుంటే మనం అంతా సంతోషంగా ఉండొచ్చు కదమ్మా అని అంటుంది చిన్ని. దాంతో కావేరి.. ‘చిన్నీ నీకు దండం పెడతాను వాడి గురించి మాట్లాడొద్దు అని దండంపెట్టేస్తుంది కావేరి.

ప్లీజ్ ఒక్కసారి నాన్నతో మాట్లాడమ్మా..
నీక్కూడా నేను దండం పెడతాను అమ్మా.. నువ్వు ఒక్కసారి నాన్నతో మాట్లాడు. పెద్ద వాళ్లు చిన్న వాళ్లని ఆశీర్వదించాలే తప్ప.. దండం పెట్టకూడదు. ప్లీజ్ అమ్మా నాన్నతో ఒక్కసారి మాట్లాడమ్మా అని ప్రాధేయపడుతుంది చిన్ని. దాంతో కావేరి.. ఛీ ఛీ ఆ నీఛుడితో నేను మాట్లాడాలా?? వాడు మారడని చెప్పాను కదా’ అని అంటుంది. ‘మారాడని చెప్తున్నా కదమ్మా.. అయినా నువ్వు మాట్లాడితేనే కదా.. మారాడో లేదో తెలిసేది అని చిన్ని చేతులు పట్టుకుని ఎంత ప్రాధేయపడినా కూడా.. చచ్చినా నేను వాడితో మాట్లాడను’ అని తెగేసి చెప్తుంది కావేరి.

టీచరమ్మ కడుపు నిండా పెట్టింది మామయ్యా.. ఆకలి లేదు
సరే నువ్వు నాన్నతో మాట్లాడొద్దు.. నువ్వు నన్ను తినమని అడగొద్దు.. ఈ క్షణం నుంచి నువ్వు నాన్నతో మాట్లాడేవరకూ నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను అని దీక్షకి దిగుతుంది చిన్ని. అయితే ఈ విషయాన్ని.. బాలరాజుకి ఫోన్ చేసి చెప్తుంది భారతి. కావేరి చిన్నిల మధ్య గొడవ అయ్యిందని చిన్ని ఏమీ తెనడం లేదని జరిగింది మొత్తం చెప్తుంది భారతి. అయితే చిన్ని అన్నమాట ప్రకారం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదు. సత్యం బాబు అన్నం తినడానికి పిలిచినా ఆకలి లేదని మాటదాటవేస్తుంది. సత్యం బాబు గట్టిగా అడిగేసరికి.. టీచరమ్మ స్నాక్స్ పెట్టింది.. కడుపు నిండిపోయింది అని అంటుంది. ఆ మాటల్ని చాటుగా వినేస్తుంది కావేరి.