Home ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన : ఏలూరి

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన : ఏలూరి

44
0

చినగంజాం : ఎన్‌టిఆర్‌ సేవ పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండలంలోని పెద్దగంజాం పంచాయతీ కొత్త గొల్లపాలెం రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు సోమవారం పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్దికి కావాల్సిన పనులు, వనరుల వివరాలు తెలుసుకున్న ఆయన ముఖ్యమంత్రికి వివరించనున్నారు. గ్రామంలో ఎన్‌టిఆర్‌ సేవా పెన్షన్‌ లబ్దిదారలతో మాట్లాడారు. లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్దులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, అనారోగ్యంతో శాశ్వతంగా బాధపడే వారికి, పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.15వేలు పెన్షన్‌ ఇస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో మొట్టమొదటి సారి రూ.40లతో పెన్షన్‌ ప్రారంభించిన ఘనత అన్న ఎన్‌టిఆర్‌దేనని గుర్తు చేశారు. ఆ తర్వాత రూ.200 ఉన్న పెన్షన్‌ రూ.వెయ్యికి, రూ.వెయ్యి నుండి రూ.2వేలకు, ఇప్పుడు రూ.4వేలకు పెన్షన్‌ పెంచిన ఘనత పేదల అవసరాలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది, పేదల సంక్షేమం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలతో నేరుగా కలిసే నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులు చంద్రబాబునాయుడు కాలంలోనే జరిగాయని గుర్తు చేశారు. సాగునీళ్లు, రోడ్లు, వంతెనలు ఇలా అనేక పనులు చేసినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి పర్యటన ఇలా…
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుండి హెలికాప్టర్‌లో ఉదయం 10.40కి బయలుదేరి 11.10కి చినగంజాం మండలం కొత్తగొల్లపాలెం హెలిపాడ్‌కు చేరుకుని అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం 11.20నుండి 11.40 వరకు ప్రజాప్రతినిధులతో మీటింగులో మాట్లాడతారు. 11.45కు రోడ్డు మార్గంలో కొత్తగొల్లపాలెం గ్రామం చేరుకుంటారు. 11.45 నుండి 12.25వరకు గ్రామంలో పెన్షన్‌ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ అందజేస్తారు. 12.25 నుండి 12.35 వరకు ఇద్దరు దివ్వాంగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందజేసి ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. 12.35నుండి 1.30వరకు ప్రజావేదిక వద్ద గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడతారు. 1.40 నుండి 2.10వరకు విశ్రాంతి అనంతరం 2.15కు కాడ్రే మీటింగ్‌ వద్దకు చేరుకుని 3.35వరకు కాడ్రె మీటింగులో పాల్గొంటారు. 3.40కి మీటింగు నుండి హెలీప్యాడ్‌కు చేరుకుని 3.45కు హెలికాప్టర్‌ ద్వవారా 4.15కు తిరి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారని సిఎం కార్యాలయ అధికారి ఆర్‌ క్రిష్టకపర్ధి తెలిపారు.