Home ఆంధ్రప్రదేశ్ అర‌కు ఎంఎల్ఎ హ‌త్య‌పై చంద్రబాబు దిగ్భ్రాంతి

అర‌కు ఎంఎల్ఎ హ‌త్య‌పై చంద్రబాబు దిగ్భ్రాంతి

611
0

అమరావతి : మావోయిస్టుల చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంపై అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల చ‌ర్య‌ల‌ను అధికారుల‌కు ఆయ‌న‌కు వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోసం కిడారి, సివేరి చేసిన సేవలను కొనియాడారు. ఇద్ద‌రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఖండించాలన్నారు.

గ్రామదర్శినిలో పాల్గొనే ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటననేపథ్యంలో ప్రజాప్రతినిధులకు భద్రతపై తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో ఆదేశించింది. మావోయిస్తు దాడిపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్‌పీలతో సిఎంఒ అధికారులు ఫోన్‌లో మాట్లాడారు.