పర్చూరు : బటన్లు నొక్కామని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారని వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానమని అన్నారు. అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక. రాష్ట్రంలో టీడీపీ ఇంత బలంగా ఉందంటే అందుకు వెనుకబడిన వర్గాలే కారణం. 43 ఏళ్లుగా టీడీపీ జెండా మోసింది బలహీన వర్గాలే . బెదిరించినా భయపడకుండా ఎదురొడ్డి పోరాడారు. జెండా మోశారు. పార్టీని ఆదుకున్న వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.