ఒంగోలు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టంగుటూరు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు శనివారం ఒంగోలులో కలిశారు. తహసిల్దార్ కార్యాలయం వెనుక ఉన్న పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో 600 మంది అనర్హులని అధికారులు తేల్చినా ఆ ఫైలు ఇంతవరకు ముందుకు కలగడం లేదని చంద్రబాబు కు పిర్యాదు చేసారు. వెంటనే అనర్హులు తొలగించి అర్హులకు పట్టాలు ఇచ్చేలా చేయాలని కోరారు.
గ్రామంలోని ఈనాం భూముల సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరారు. ఇటీవల చుక్కల భూములకు ఇచ్చిన జీవో పరిధిలోకి ఇది కూడా వచ్చేలా చేస్తామని చెప్పి సమస్యకు ప్రాధాన్యత లేకుండా చేశారు. గ్రామంలో సాగు తాగునీటి అవసరాలకు ముసికి సాగర్ నీరు వదలాలని కోరారు. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఉత్తరం వైపు త్వరగా పూర్తి చేయాలని కోరారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఫైర్ స్టేషన్ నుండి ఆర్టీసీ డిపో వరకు రోడ్డు వెడల్పు చేసి మధ్యలో డివైడర్స్ లైట్లు ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని కోరారు. టిడిపి ప్రభుత్వంలో గ్రామం ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా కొండేపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పార్టీ శ్రేణులను కలుపుకొని పోతూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఆయనకు కొండేపి సీటు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు.
ముఖ్యమంత్రిని కలిసిన కలిసిన వారిలో టంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు కామని విజయకుమార్, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపిటిసిలు భారతి, పద్మ, ఉన్నం పెద్దబ్బాయి, కుందేటి వెంకట్రావు, కొత్త నాగేశ్వరరావు, కామని శ్రీను, ఓం ప్రకాష్, భరత్ ఉన్నారు.