చీరాల : బాల్యవివాహాలు చట్టవిరుద్దమని, బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని మతాల పెద్దలు ముందుకు రావాలని తహశీల్దారు ఎం వెంకటేశ్వర్లు కోరారు. గర్ల్స్ అడ్వకసి అలయన్స్‌లో భాగంగా హెల్ప్ సంస్థ సమన్వయంతో క్రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చీరాల తహశీల్దారు కార్యాలయం ఆవరణలో బాల్యవివాహం – మతపెద్దల పాత్ర అంశంపై మతపెద్దలు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో బుధవారం సదస్సు నిర్వహించారు. బాల్యవివాహాలను జరిపించడం, ప్రోత్సహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ఎంపిడిఒ ఆర్ వెంకటేశ్వర్లు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, హెల్ప్ సంస్థ కోఆర్డినేటర్ కె రమేష్, క్రీడ్స్ సంస్థ డైరెక్టర్ డేవిడ్‌రాజు, దాసరి ఇమ్మానియేలు, సాము్యల్, వావిల సదాశివశాస్ర్తి, వేటపాలెం ఐసిడిఎస్ సూపర్‌వైజర్ విజయకుమారి పాల్గొన్నారు.