Home ప్రకాశం మనీషా హత్యకు కారణమైన దోషులను తక్షణమే శిక్షించాలి : విరసం రాష్ట్ర నాయకులు జి కళ్యాణరావు

మనీషా హత్యకు కారణమైన దోషులను తక్షణమే శిక్షించాలి : విరసం రాష్ట్ర నాయకులు జి కళ్యాణరావు

403
0

టంగుటూరు (దమ్ము) : మనీషా వాల్మీకి అనే దళిత యువతిని అత్యంత అమానవీయంగా అత్యాచారం చేసి, మరణానికి కారకులైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకులు జి కళ్యాణరావు డిమాండ్ చేశారు. మనీషా హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ టంగుటూరు మండలం ఆలకూరపాడులో క్రొవ్వొత్తులు, కాగడాలతో భారీప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా జి కళ్యాణరావు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే దళితులపైన, దళిత స్త్రీలపైన జరిగినటువంటి అనేక మైనటువంటి దాడుల్లో ఒక్కటిగా ఉత్తరప్రదేశ్ లో సెప్టెంబర్ 14న మనీషా వాల్మీకి అనే చదువులో తెలివైన అమ్మాయిపైన అక్కడి భూస్వామ్య ఠాకూర్ కులస్తులు అత్యాచారం చేసి, గొంతు నులిమి, నాలుక కోసి, వెన్నెముక విరిచి, ఎన్ని దుర్మార్గమైన చర్యలు చేయాలో అన్ని దుర్మార్గమైన చర్యలు చేసి, ఆమె మరణానికి కారకులయ్యారని అన్నారు. అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, అక్కడి పోలీసులు, డాక్టర్లు, అధికారులు ఆఖరికి కలెక్టర్ తో సహా,
మనీషాని అత్యాచారం చేసి మరణానికి కారణమైన ఆ నలుగురు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారే తప్ప అత్యాచారానికి గురై హత్య చేయబడిన ఆ అమ్మాయిని గురించి మాత్రం ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. యూపీలో జరుగుతున్న ఘోరాలు బయటి ప్రపంచానికి తెలియపరచడానికి మీడియా ప్రతినిధులు వస్తే అక్కడి కలెక్టర్ మీడియా వాళ్లను అడ్డుకుంటున్నారని అన్నారు. మీడియా ఈరోజు ఉంటుంది. రేపు వెళ్ళిపోతుంది. రేపటి నుండి మేము ఇక్కడ ఉంటాం అని బెదిరించడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక భూస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అని ప్రశ్నించారు. హత్యోన్మాదం చేసిన నలుగురు ఠాగూర్ లతో పాటు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాధ్, కలెక్టర్, ఎస్పీలు కూడా ముద్దాయిలేనని అన్నారు. దోషులును కాపాడడానికి బీజేపీ తాపత్రయ పడుతుందన్నారు. ఆ నలుగురిని దోషులుగా చేర్చాలని డిమాండ్ తో మనీషా వాల్మీకి లాంటి బాధితుల పక్షాన మనం నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనీషా హంతకులను వెంటనే శిక్షించాలని వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉందన్నారు. మరో బిడ్డకు ఇలాంటి అన్యాయం జరగకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలపాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డి యోబు, యల్ సర్జనరావు, యన్ హరిబాబు, యల్ మురళీ, ప్రభాకర్, విజయకుమార్ పాల్గొన్నారు.